ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలి: ఓవైసీ

కశ్మీర్ అంశంలో ట్రంప్ జోక్యంపై భారత్ ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. భారత్-పాక్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభ విషయంలో అమెరికా చొరవ తీసుకునే విషయంలో భారత్ వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో భారత దౌత్య విధానం సరికాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్ విషయాన్ని హిందూ ముస్లిం సమస్యగా చూస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల సమస్యను రెండు వర్గాల సమస్యగా చూడటం […]

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలి: ఓవైసీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 22, 2019 | 12:51 PM

కశ్మీర్ అంశంలో ట్రంప్ జోక్యంపై భారత్ ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. భారత్-పాక్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభ విషయంలో అమెరికా చొరవ తీసుకునే విషయంలో భారత్ వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో భారత దౌత్య విధానం సరికాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్ విషయాన్ని హిందూ ముస్లిం సమస్యగా చూస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాల సమస్యను రెండు వర్గాల సమస్యగా చూడటం సరికాదన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని వహిస్తానని చెప్పిన తర్వాత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఒవైసీ ప్రశ్నించారు. అసలు మన విదేశీ విధానం ఏమిటని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ విషయంలో ఇరు దేశాల ప్రధానులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించారు. అయితే భారత్ వాదనను విన్న ఆయన ఆ తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో కూడ మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఆయన మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.