Chidambaram Arrest: చిదరంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరాన్ని ఆయన ఇంటి వద్ద సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయకపోవడంతో సీబీఐ అధికారులు బలవంతంగా లోపలికి ప్రవేశించి అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం చిదరంబరంను ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న చిదంబరం కొద్ది సేపటి క్రితమే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలను […]
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరాన్ని ఆయన ఇంటి వద్ద సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయకపోవడంతో సీబీఐ అధికారులు బలవంతంగా లోపలికి ప్రవేశించి అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం చిదరంబరంను ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న చిదంబరం కొద్ది సేపటి క్రితమే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు తనకు ఎలాంటి సబంధం లేదని చెప్పారు. తాను ఎలాంటి నేరం చేయలేదని.. ఈ కేసులో కావాలనే కొందరు తనను ఇరికించారని వాపోయారు.