బ్రేకింగ్: ఏపీ మాజీ స్పీకర్ కోడెలకు అస్వస్థత
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఛాతినొప్పితో హాస్పిటల్‌లో చేరారు. ఆయనను గత కొన్ని రోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ఆయనకు ఛాతినొప్పి రావడంతో గుంటూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి, తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. […]
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఛాతినొప్పితో హాస్పిటల్‌లో చేరారు. ఆయనను గత కొన్ని రోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ఆయనకు ఛాతినొప్పి రావడంతో గుంటూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి, తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన కూడా అంగీకరించారు. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని, కావాలంటే తీసుకుని వెళ్లొచ్చనికూడా చెప్పారు. ఓ స్పీకర్‌గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు, బెంచీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది. మరోవైపు 2018లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి 30 ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లారంటూ కోడెల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.