పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే అంటున్నారు పోషకాహార నిపుణులు
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో నారింజ నుంచి జామ వరకు చాలా రకాల సీజనల్ పండ్లు వస్తుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి
TV9 Telugu
శీతాకాలం సీజనల్ పండ్లలో జామ ఒకటి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటాయి. జామలో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
జామపండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జామలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. పండు సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది
TV9 Telugu
జామ శరీరం నుంచి హానికారక ఫ్రీరాఢికల్స్‌ను బయటకు పంపి.. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా అడ్డుకుంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధకంగానూ పనిచేస్తుంది. అయితే ఎన్ని లాభాలు ఉన్నా కొన్ని రకాల వ్యాధులతో పోరాడే వారు జామ అస్సలు తినకూడదు
TV9 Telugu
ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవారు జామపండ్లు తినకూడు. జామ రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతున్నప్పటికీ ఇది స్వభావరిత్యా చల్లదనం కలిగి ఉంటుంది. అందుకే దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలున్నవారు జామపండు తినకూడదు
TV9 Telugu
అలాగే శస్త్రచికిత్సకు ముందు, ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ జామ తినకూడదు. జామపండు తిన్న తర్వాత కడుపు ఉబ్బరం అనిపించినా, అలర్జీ సమస్యలున్నా జామపండు తినడం మానుకోవాలి