- Telugu News Photo Gallery Eating Lakshmana fruit prevents 12 types of cancer, Check Here is Details in Telugu
Lakshmana fruit: ఈ పండు కనిపిస్తే వదలకుండా తినండి.. 12 రకాల క్యాన్సర్లకు చెక్!
పండ్లో ఎన్నో రకాల ఉన్నాయి. ఇంకా కొత్త రకాల పండ్లు కూడా చాలానే మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిల్లో లక్ష్మణ ఫలం కూడా ఒకటి. ఈ పండు ఇంచుమించు సీతా ఫలంలా ఉంటుంది. ప్రమాదకర క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవడంలో చక్కగా పని చేస్తుంది..
Updated on: Jan 12, 2025 | 1:09 PM

లక్ష్మణ ఫలం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సీతా ఫలం.. రామ ఫలం లాగానే లక్ష్మణ ఫలం కూడా ఉంది. చూడటానికి కూడా సీతా ఫలంలాగానే ఉంటుంది. కాకపోతే పైన చూసేందుకు మాత్రం కాస్త వెరైటీగా ఉంటుంది.

సీతా ఫలం కంటే లక్ష్మణ ఫలంలో ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లు ఇండియాలో ఎక్కువగా కనిపించవు. ఈ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల దాదాపు 12 రకాల కేన్సర్లు రాకుండా ఉంటాయి.

ఈ పండు తింటే శరీరం మొత్తం క్లీన్ అయిపోతుంది. కడుపులో, శరీరంలో ఎలాంటి విష పదార్థాలు, మలిన పదార్థాలు ఉన్నా బయటకు పోతాయి. జ్వరంలో ఉన్నప్పుడు ఈ పండు తింటే కంట్రోల్ అవుతుంది.

కండరాల నొప్పి తగ్గడానికి, షుగర్, బీపీ, మైగ్రేన్ తగ్గడానికి, మూత్రకోశ వ్యాధులను కంట్రోల్ చేయడానికి, బాలింతల్లో పాలు వృద్ధి చెందడానికి కూడా లక్ష్మణ ఫలం ఎంతో చక్కగా పని చేస్తుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో లక్ష్మణ ఫలం సహాయ పడుతుంది. ఈ పండు తినడం వల్ల ఒక్కటి కాదు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కనిపిస్తే ఏ మాత్రం లేట్ చేయకుండా తినండి. రుచిగా కూడా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




