తలసాని వెనక జగన్ ఉన్నారు: టీడీపీ

విజయవాడ: టీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనక జగన్ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్-తలసాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వెళుతున్న నాయకులపై స్పందిస్తూ టిక్కెట్ రాదని భయపడుతున్నవారే ఆ విధంగా చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. ఇదిలా ఉంటే అంతుకుమందు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష మూడేళ్ల క్రితం చేసి ఉంటే ఏపీకి […]

తలసాని వెనక జగన్ ఉన్నారు: టీడీపీ

విజయవాడ: టీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనక జగన్ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్-తలసాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వెళుతున్న నాయకులపై స్పందిస్తూ టిక్కెట్ రాదని భయపడుతున్నవారే ఆ విధంగా చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు.

ఇదిలా ఉంటే అంతుకుమందు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష మూడేళ్ల క్రితం చేసి ఉంటే ఏపీకి ప్రయోజనం కలిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీలో చంద్రబాబు తీసుకువస్తున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రైతులకు పదివేల రూపాయలు ఇస్తానన్న పథకంలో స్పష్టత లేదని, రిజర్వేషన్‌ అమలులో సందేహాలున్నాయి. హైదరాబాద్‌కు ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి పోతున్నప్పుడు విజయవాడకు తామొస్తే ఆంక్షలెందుకని తలసాని ప్రశ్నించారు.

Published On - 3:33 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu