YS Viveka Murder Case: సీబీఐ దర్యాప్తునకు సీఎం నో

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పినతండ్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను సర్కార్ తోసిపుచ్చింది.

YS Viveka Murder Case: సీబీఐ దర్యాప్తునకు సీఎం నో
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 20, 2020 | 6:00 PM

Jagan government rejected a proposal to handover Viveka murder case to CBI: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పినతండ్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్‌ను సర్కార్ తోసిపుచ్చింది. ఇప్పటికే నియమించిన సిట్ త్వరలోనే దర్యాప్తును పూర్తి చేయనుందని, కేసు తేలిపోయే సమయంలో సీబీఐ దర్యాప్తు అనవసరమని జగన్ ప్రభుత్వం అమరావతి హైకోర్టుకు వివరించింది. ఈ మేరకు ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఈ హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలున్నాయని, అందుకే సీబీఐ విచారణను కోరుతున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాదితో విభేదించిన ఏపీ అడ్వకేట్ జనరల్ వివేకా హత్యకేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేయబోతోందని, దర్యాప్తు చివరి దశలో వుందని ఏజీ కోర్టుకు విన్నవించారు.

ఒకవైపు దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో సిబిఐ విచారణ అవసరం ఏంటని ఏజీ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో ఏజీ కోర్టుకు అందజేశారు. సిట్ దర్యాప్తు చేసిన సిడి, జీడీ ఫైలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి..విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.

Also read: New trend among Telangana Congress leaders