Breaking News
  • రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు తప్పనిసరిగా మూసివేయాలన్న కేంద్రం. సరుకు రవాణా మినహా ఎలాంటి రవాణాకు అనుమతి నిరాకరణ. కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలన్న కేంద్రం. వలస కూలీలకు 14 రోజుల క్వారంటైన్‌. అద్దె డిమాండ్‌ చేసే ఇంటి యజమానులపై కఠిన చర్యలు. లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేయాలని కేంద్రం ఆదేశాలు.
  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు. 7,21,412కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. ఇప్పటివరకు కోలుకున్న 1,51,004 మంది. ప్రపంచ వ్యాప్తంగా 33,956 మంది మృతి. స్పెయిన్‌లో నిన్న ఒక్కరోజే 838 మంది మృతి. నిన్న ఇటలీలో 756 మంది, ఫ్రాన్స్‌లో 292 మంది మృతి. నిన్న అమెరికాలో 237 మంది, బ్రిటన్‌లో 209 మంది మృతి. నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 17,600 కేసులు నమోదు. అమెరికాలో 1,41,812 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య. చైనా-3,300, ఇరాన్‌-2,640, ఫ్రాన్స్‌-2,606 మంది మృతి. అమెరికా-2,475, ఇంగ్లాండ్‌-1,228 మంది మృతి.
  • కరోనాపై పోరుకు ఏపీ ఐఏఎస్‌ అధికారుల ఆర్థిక చేయూత. మూడు రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని.. ఐఏఎస్‌ అధికారుల సంఘం నిర్ణయం.
  • ఛత్తీస్‌గఢ్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పాండేపై కేసు నమోదు. బిలాస్‌పూర్‌లో 144 సెక్షన్‌ ఉల్లంఘించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు.
  • ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ అధికారుల సస్పెన్షన్‌. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కేంద్రహోంశాఖ. కరోనా నివారణపై నిర్లక్ష్యం వహించినందుకు కేంద్రం చర్యలు.

Telangana Congress: టీ.కాంగ్రెస్‌లో కొత్త వైఖరి.. రీజన్ తెలిస్తే షాకే

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను ఇప్పుడు వింత వైరస్‌ వెంటాడుతోంది. పీసీసీ పగ్గాలు మారే టైమ్‌లో వారిని ఈ వైరస్‌ ఇబ్బంది పెడుతోందట.
new trend in telangana congress, Telangana Congress: టీ.కాంగ్రెస్‌లో కొత్త వైఖరి.. రీజన్ తెలిస్తే షాకే

New trend in Telangana congress leaders: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను ఇప్పుడు వింత వైరస్‌ వెంటాడుతోంది. పీసీసీ పగ్గాలు మారే టైమ్‌లో వారిని ఈ వైరస్‌ ఇబ్బంది పెడుతోందట. ఏదైనా మీటింగ్‌కు ఓ నేత హాజరుకాకపోతే చాలు…ఈ వైరస్‌ వారిని తెగ వేధిస్తోందట. ఇంతకీ కాంగ్రెస్‌ నేతలకు టెన్షన్ పెడుతున్న ఆ వైరస్‌ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ టైమ్‌లో నేతలు అందరూ అలర్ట్‌గా ఉంటున్నారు. పీసీసీ రేసులో ఉన్న కాంగ్రెస్‌ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్వహించే సమావేశాలకు ఒక వేళ హాజరుకాకపోతే నేతలు ఇంతకుముందు లైట్‌గా తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం నేతలు తాము మీటింగ్‌కు ఎందుకు రాలేదో పార్టీకి సమాచారం ఇస్తున్నారు. పనిలో పనిగా మీడియాకు కూడా ఇన్‌ఫర్మేషన్‌ చెరవేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో ఈ మార్పు ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే…అసలు విషయం తెలిసింది.

రిజర్వేషన్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ నేతలు అందరు హాజరయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదు అనే చర్చ సభా ప్రాంగణంలో చర్చ జరిగింది. పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి అలక వహించారా? లేక నిజంగానే ఏదైనా కారణంతో రాలేదా? అని డిస్కషన్‌ నడిచింది

కోమటిరెడ్డి అబ్సెంట్‌పై చర్చ జరగడంతో…..ఆయనకు ఈ విషయం తెలిసింది. తాను వ్యవసాయ సహకార సంస్థల ఎన్నికల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాయని వివరణ ఇచ్చారు. ఈవిషయం పార్టీతో పాటు పత్రికలకు కూడా తెలియజేశారు. అసలే పీసీసీ రేసులో తాను ఉన్నానని…అదృష్టం కలిసి వస్తే.. తాను పార్టీ అధ్యక్షుడిని అవుతానని.. ఈటైమ్‌లో ఎందుకు వచ్చిన తంటా అని ఆయన జాగ్రత్త పడ్డారట. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య అనవసరమైన విషయాలు మాట్లాడకుండా…..ఎవరినీ నొప్పించకుండా ముందుకు వెళుతున్నారట. మొత్తానికి పీసీసీ రేసులో ఉన్న నేతలు కొంతకాలంగా జాగ్రత్తగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

Also read: MLC ticket race in TRS Party

Related Tags