4 కోట్ల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెడీ.. కానీ మనకో కాదో? సిరం వ్యాక్సిన్ సిద్దం, ఐసీఎంఆర్ ఆమోదమే తరువాయి..

4 కోట్ల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెడీ.. కానీ మనకో కాదో? సిరం వ్యాక్సిన్ సిద్దం, ఐసీఎంఆర్ ఆమోదమే తరువాయి..

ఓవైపు కరోనా కరాళనృత్యం ఇంకా ఆగలేదు. యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. పలు పరిశోధనా సంస్థలు.. వాటితో టై అప్ అయిన...

Rajesh Sharma

|

Nov 12, 2020 | 8:03 PM

Four crore dose vaccine ready: ఓవైపు కరోనా కరాళనృత్యం ఇంకా ఆగలేదు. యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. పలు పరిశోధనా సంస్థలు.. వాటితో టై అప్ అయిన ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై పెద్ద ఎత్తున సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో సిరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రజెనికా తయారు చేసిన ‘కోవీ షీల్డ్‘ వ్యాక్సిన్ నాలుగు కోట్ల డోసులను రెడీ చేసినట్లు ప్రకటించింది.

ప్రస్తుతం కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ ప్రయోగాలను సీరం ఇనిస్టిట్యూట్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. 1600 మంది వాలంటీర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. కోవిషీల్డ్ నాలుగు కోట్ల డోసులను సిద్దం చేసిన సిరం ఇనిస్టిట్యూట్.. నోవావాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల కోసం సిరం ఇనిస్టట్యూట్ ఎదురు చూస్తోంది.

ఇదిలా వుంటే.. ప్రస్తుతం ఉత్పత్తి చేసిన నాలుగు కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన దేశీయుల కోసమా లేక ఏదైనా దేశం నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు రూపొందించారా అన్న విషయాన్ని మాత్రం సిరం సంస్థ వెల్లడించడం లేదు. ఎందుకంటే మనదేశంలో కోవిషీల్డ్ ఇంకా తుది దశ ప్రయోగాలలోనే వుంది. అలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి అనుమతి లేదు. మరి సిరం ఇనిస్టిట్యూట్ ఎవరి కోసం ఈ నాలుగు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ తయారు చేసి పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: కిడ్నాప్ సుఖాంతమైనా.. గుండెపోటు బలి తీసుకుంది!

ALSO READ: ‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన సర్కార్

ALSO READ: ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన నిర్మల

ALSO READ: కొండ చిలువకు సర్జరీ.. స్నేక్ క్యాచర్ ఔదార్యం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu