కిడ్నాప్ సుఖాంతమైనా.. గుండెపోటు బలి తీసుకుంది.. అత్తాపూర్ డాక్టర్ ఇంట్లో విషాదం, హార్ట్ అటాక్‌తో వైద్యుడు మృతి

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన డాక్టర్ కిడ్నాప్ చివరికి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సుఖాంతమైందని భావిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది.

కిడ్నాప్ సుఖాంతమైనా.. గుండెపోటు బలి తీసుకుంది.. అత్తాపూర్ డాక్టర్ ఇంట్లో విషాదం, హార్ట్ అటాక్‌తో వైద్యుడు మృతి
Follow us

|

Updated on: Nov 12, 2020 | 8:05 PM

Kidnapped doctor died of heart-attack: హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన డాక్టర్ కిడ్నాప్ చివరికి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సుఖాంతమైందని భావిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది. కిడ్నాప్ టెన్షన్ కొనసాగుతుండడమో లేక మరేదైనా కారణమో కానీ ఆ డాక్టర్ గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ షరీఫ్‌ను పది రోజుల క్రితం కిడ్నాప్ చేసి బెంగళూరు తరలిస్తుండగా.. పోలీసులు చాకచక్యంతో అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. డాక్టర్‌ను సేఫ్‌గా రక్షించామన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం ఆ డాక్టర్ గుండెపోటుతో మరణించారు.

కిడ్నాపర్ల చెర నుంచి విముక్తుడైనప్పటికీ.. గత పది రోజులుగా డాక్టర్ షరీఫ్ చాలా డిప్రెషన్‌తో వుండేవాడని కుటుంబీకులు చెబుతున్నారు. హైదరాబాద్ అత్తాపూర్‌లో కిడ్నాప్‌కు గురైన డాక్టర్ షరీఫ్‌ను కిడ్నాపర్లు బెంగళూరు తరలిస్తుండగా.. అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఉదంతం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వివిధ రకాల సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించారు. పొరుగునే వున్న ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. ఏపీ పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో డాక్టర్‌ను కిడ్నాప్ చేసిన వాళ్ళు అతన్ని బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లాలో వారిని పట్టుకుని, కిడ్నాపర్ల చెర నుంచి డాక్టర్ షరీఫ్‌ను విడిపించారు.

డాక్టర్ షరీఫ్ కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో ఆయన కుటుంబీకులు, బంధువులతోపాటు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కిడ్నాపర్ల చెర నుంచి వచ్చినప్పటికీ డాక్టర్ షరీఫ్ డిప్రెషన్‌లోనే వున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గురువారం మధ్యాహ్నమే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ALSO READ: ‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన సర్కార్

ALSO READ: ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన నిర్మల

ALSO READ: కొండ చిలువకు సర్జరీ.. స్నేక్ క్యాచర్ ఔదార్యం