AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై కాల్పులు.. భయంతో పారిపోయిన జనం… వీడియో

దేశ రాజధానిలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో  ఓ వ్యక్తిపై  దుండగులు పట్టపగలే కాల్పులు జరిపారు. రోహిణిలోని సెక్టార్-11లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైపోయారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ […]

నడిరోడ్డుపై కాల్పులు.. భయంతో పారిపోయిన జనం... వీడియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:51 PM

Share

దేశ రాజధానిలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో  ఓ వ్యక్తిపై  దుండగులు పట్టపగలే కాల్పులు జరిపారు. రోహిణిలోని సెక్టార్-11లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైపోయారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.