Perni fires చంద్రబాబు ఓ అంతర్జాతీయ తీవ్రవాది.. పేర్ని లాజిక్కిదే!

ఏపీ మంత్రి పేర్ని నాని విపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన్ను అంతర్జాతీయ తీవ్రవాది అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. జాగ్రత్తలు చెబుతున్నట్లు నటిస్తూనే చంద్రబాబు జిత్తులు చూపిస్తున్నారని పేర్ని మండిపడ్డారు.

Perni fires చంద్రబాబు ఓ అంతర్జాతీయ తీవ్రవాది.. పేర్ని లాజిక్కిదే!
Follow us

|

Updated on: Apr 06, 2020 | 4:58 PM

AP Minister Perni Nani fires on Chandrababu: ఏపీ మంత్రి పేర్ని నాని విపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన్ను అంతర్జాతీయ తీవ్రవాది అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. జాగ్రత్తలు చెబుతున్నట్లు నటిస్తూనే చంద్రబాబు జిత్తులు చూపిస్తున్నారని పేర్ని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని ఆయన ఆరోపించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణా చర్యలను ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి సమీక్షించిన తర్వాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ యంత్రాంగం కరోనాపై యుద్ధం చేస్తుందని, రాష్ట్రంలో 20 వేలకు పైగా క్వారెంటీన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందన్న పేర్ని నాని.. రెడ్ జోన్‌లో కూడా ప్రాణాలకు తెగించి మరీ ప్రభుత్వ యంత్రాంగం సైనికుల్లా పనిచేస్తోందని తెలిపారు.

ఇలాంటి సమయంలోనూ చంద్రబాబు నీచ బుద్ధి చూపిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. ‘‘జాగ్రత్తలు చెప్తునట్టు నటిస్తూ నక్క జిత్తులు చూపిస్తున్నాడు.. చంద్రబాబు మనస్తత్వం అంతర్జాతీయ తీవ్రవాదిని తలపిస్తుంది.. హైదరాబాద్ లో కాపురం ఉంటూ.. ఇక్కడ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడు.. రాష్ట్రంలో లెక్కకు మించి పాజిటివ్ కేసులు ఉన్నాయని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు కరోనా కంటే ప్రమాదమైన వైరస్ లాంటివాడు..’’ అంటూ తీవ్ర పదజాలంతో మంత్రి నాని విరుచుకుపడ్డారు.

కరోనాని జయించేందుకు ప్రతీ పౌరుడూ యుద్ధం చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని, ఉద్యోగుల్ని చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారని నాని ఆరోపిస్తున్నారు. కేంద్రం నుండి వచ్చే 500 రూపాయల సహాయం జన్ ధన్ అకౌంట్స్‌లో వేశారని, దేశంలోనే మొదటగా కరోనా సహాయం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పేదవారికి వెయ్యి రూపాయలు అందించామని నాని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేయి రూపాయలు కేంద్రం ఇచ్చిందని చెప్పడం చంద్రబాబు అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు పంచన చేరి దిగజారిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..