#Corona effect ఎన్పీఆర్, సెన్సెస్ నిరవధిక వాయిదా
దేశంలో కరోనాప్రభావితం చేయని రంగమంటూ కనిపించడం లేదు. చివరికి జనాభా లెక్కల సేకరణపై కూడా కరోనా ప్రభావం చూపింది. కరోనా నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తొలి దశ జనాభా లెక్కల సేకరణను కేంద్ర హోం శాఖ నిరవధికంగా వాయిదా వేసింది.
Union Home ministry postponed Censes and NPR: దేశంలో కరోనాప్రభావితం చేయని రంగమంటూ కనిపించడం లేదు. చివరికి జనాభా లెక్కల సేకరణపై కూడా కరోనా ప్రభావం చూపింది. కరోనా నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తొలి దశ జనాభా లెక్కల సేకరణను కేంద్ర హోం శాఖ నిరవధికంగా వాయిదా వేసింది. దాంతోపాటు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపిన ఎన్పీఆర్ అమలును కూడా కేంద్రం నిరవధికంగా వాయిదా వేసింది.
తొలుత ఎన్నార్సీ.. ఆ తర్వాత సీఏఏ.. అదే క్రమరంలో ఎన్పీఆర్ దేశంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. మోదీ ప్రభుత్వంపై పలు విపక్షాలు విరుచుకుపడ్డాయి. కొన్ని రాష్ట్రాలు ఎన్పీఆర్‌ను అమలు చేయబోమని మోదీ ప్రభుత్వానికి గట్టిగా చెప్పేశాయి. అదే సమయంలో జనాభా లెక్కల సేకరణ తొలిదశకు షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రం. దానిపై కూడా కేంద్రాన్ని తప్పుపట్టాయి పలు రాజకీయ పార్టీలు.
ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మొదలైంది. ప్రపంచంలోని సుమారు 160 దేశాల్లో కరోనా వైరస్ విస్తరించింది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకంలో పడేసింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. ప్రజల్లో వైరస్ ప్రబల కుండా వుండేందుకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా లెక్కల సేకరణ తొలిదశతోపాటు ఎన్పీఆర్ అమలును కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు హోం శాఖ వెల్లడించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాతనే జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.ః