AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

కరోనా వైరస్‌ని అడ్డుకోవాలంటే.. అందరూ కృషి చేయాల్సిందే. ముఖ్యంగా అందులో.. కరోనా లక్షణాలున్న ఎవరున్నా చెప్పాల్సిందే. దాచిపెడితే.. అది మొత్తం సమాజ నాశనానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఓ పోలీష్ ఆఫీసర్.. తన కొడుకు విదేశం నుంచి వచ్చిన..

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2020 | 8:29 PM

Share

కరోనా వైరస్‌ని అడ్డుకోవాలంటే.. అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిందే. ముఖ్యంగా.. కరోనా లక్షణాలతో ఎవరున్నా చెప్పాల్సిందే. దాచిపెడితే.. అది మొత్తం సమాజ నాశనానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఓ పోలీస్ ఆఫీసర్.. తన కొడుకు విదేశాల నుంచి వచ్చిన విషయం దాచి పెట్టినందుకు కేసు నమోదైంది. 10 రోజుల కిందట ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు లండన్ నుంచి వచ్చాడు. వచ్చి ఇంట్లో ఉండకుండా ఊళ్లో ఉన్న స్నేహితుల్ని కలిసేందుకు చాలా ప్రదేశాలకు వెళ్లాడు. అయితే తాజాగా అతని ఆరోగ్యంలో తేడా వచ్చింది. వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపారు. అక్కడ చెక్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో అలెర్ట్ అయిన అధికారులు అతన్ని వెంటనే ఐసోలేషన్ వార్డుకు పంపారు. అలాగే వారి ఇంట్లో తల్లిదండ్రులు, సోదరిని కూడా పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదంతా మంత్రి ఈటెల వరకూ వెళ్లడంతో చాలా సీరియస్ అయ్యారు. అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు మండిపడ్డారు. కొడుకు విదేశం నుంచి వచ్చినా.. విషయాన్ని దాచి పెట్టినందుకు ఆ పోలీస్ ఆఫీసర్‌పై కేసు నమోదు చేయమని ఆదేశించారు.

అలాగే.. ఆ పోలీస్ ఆఫీసర్‌తో పని చేసిన సిబ్బంది, ఇంట్లో వారు, కుర్రాడి ఫ్రెండ్స్‌ని కూడా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. మరికొందరిని గాంధీ ఆస్పత్రికి పంపారు. ఒక్క విషయం దాచిపెట్టినందుకు.. ఇప్పుడు ఇంత పని అయింది. కాబట్టి.. విదేశాల నుంచి ఎవరైనా వస్తే దయచేసి చెప్పాలంటూ.. అటు డాక్టర్లు.. ఇటు పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

Read more also: ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

Follow Us
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!