విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు

ప్రభుత్వం ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ఏపీ ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ మెంట్‌ను పెంచింది . ఇప్పటివరకు ప్రభుత్వం  రూ.35వేలు చెల్లిస్తుండగా తాజాగా రూ.45 వేలకు పెంచారు. బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెంపు వచ్చే విద్యా సంవత్సరం (2019-2020) నుంచి వర్తిస్తుంది. కళాశాలల్లో బోధన రుసుములు రూ.35వేల  నుంచి రూ.1.09లక్షల వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఆయా కళాశాలల్లో ఉండే బోధన రుసుమును పూర్తిగా […]

Ram Naramaneni

|

Feb 20, 2019 | 2:21 PM

ప్రభుత్వం ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ఏపీ ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ మెంట్‌ను పెంచింది . ఇప్పటివరకు ప్రభుత్వం  రూ.35వేలు చెల్లిస్తుండగా తాజాగా రూ.45 వేలకు పెంచారు. బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెంపు వచ్చే విద్యా సంవత్సరం (2019-2020) నుంచి వర్తిస్తుంది. కళాశాలల్లో బోధన రుసుములు రూ.35వేల  నుంచి రూ.1.09లక్షల వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఆయా కళాశాలల్లో ఉండే బోధన రుసుమును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 10 వేలకు పైగా ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వం కనిష్ఠంగా ఇప్పటి వరకు రూ.35వేలు చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులు భరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.35వేలను పెంపు చేయాలని గత కొంతకాలంగా ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పండాదాస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి బోధన రుసుములను రూ.65వేలకు పెంచాలని సిఫార్సు చేసింది. చివరికి ప్రభుత్వం  రూ.45వేలకు పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడాదికి 1.75 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu