శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతళగంగ స్నానపు ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ మార్గంలో నడుచుకుంటూ వచ్చే భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని […]

శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2019 | 1:29 PM

మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతళగంగ స్నానపు ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ మార్గంలో నడుచుకుంటూ వచ్చే భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి 3వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.