షాక్ : ‘మిస్ తెలంగాణ’పై ఆగంతకుడు దాడి.!

షాక్ : 'మిస్ తెలంగాణ'పై ఆగంతకుడు దాడి.!

2018వ సంవత్సరంగానూ ఎంబీబీఎస్ చదువుతున్న సాయి కామాక్షి భాస్కర్ల మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వారు ఆమెను ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగి దారుణంగా గాయపరిచారట. డాక్టర్ చదువుతున్న సాయి కామాక్షి మోడలింగ్ మీద ఉన్న ఇష్టంతో 2018లో మిస్ తెలంగాణ పోటీల్లో పాల్గొని ఫైనల్స్ కి చేరి కిరీటం అందుకుంది. దీని తర్వాత మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. సోషల్ […]

TV9 Telugu Digital Desk

|

Feb 20, 2019 | 2:23 PM

2018వ సంవత్సరంగానూ ఎంబీబీఎస్ చదువుతున్న సాయి కామాక్షి భాస్కర్ల మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వారు ఆమెను ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగి దారుణంగా గాయపరిచారట.

డాక్టర్ చదువుతున్న సాయి కామాక్షి మోడలింగ్ మీద ఉన్న ఇష్టంతో 2018లో మిస్ తెలంగాణ పోటీల్లో పాల్గొని ఫైనల్స్ కి చేరి కిరీటం అందుకుంది. దీని తర్వాత మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈమె మొన్నీమధ్య అట్రాసిటీ పై న్యాయమైన మార్గంలో పయనించాలని చెప్పింది. అంతేకాదు దీనిపై పోరాటం కూడా చేసింది. ఈ విషయం నచ్చని కొందరు ఆమెపై దాడికి దిగారని అనుమానాలు వ్యక్తం చేశారు ఆమె సన్నిహితులు.

ఇది ఇలా ఉంటే ఆమె దాడికి గురైనప్పటి పిక్చర్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె నుదురు భాగంలో కూడా బలమైన గాటు పడింది. దీన్ని బట్టి ఆమెపై చాలా కసితో.. దాడికి దిగారని తెలుస్తోంది.

నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని.. వారిపై చట్టబద్ధంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కామాక్షి అన్నారు. ఆమెకు సపోర్ట్ గా నిలవడానికి పలు సంఘాలు ముందుకు వచ్చాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu