అవంతి… టిడిపి నుంచి జంప్ అవుతారా?

విశాఖ: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తెదేపా వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెదేపా నేతలకు ఆయన అందుబాటులోకి రాకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. త్వరలో వైకాపా అధినేత జగన్‌ను కలిసి వైకాపాలో చేరుతారని సమాచారం. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌.. రాబోయే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అది కుదరని పక్షంలో విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అందుకు తెదేపా అధిష్ఠానం నిరాకరించింది. అదే సమయంలో భీమిలి […]

అవంతి... టిడిపి నుంచి జంప్ అవుతారా?

విశాఖ: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తెదేపా వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెదేపా నేతలకు ఆయన అందుబాటులోకి రాకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. త్వరలో వైకాపా అధినేత జగన్‌ను కలిసి వైకాపాలో చేరుతారని సమాచారం. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌.. రాబోయే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అది కుదరని పక్షంలో విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అందుకు తెదేపా అధిష్ఠానం నిరాకరించింది. అదే సమయంలో భీమిలి టికెట్‌ ఇచ్చేందుకు వైకాపా అంగీకరించిందని సమాచారం. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం ఆయనను ఇంటికి వెళ్లి వారు పార్టీలోకి ఆహ్వానించనున్నారని, సాయంత్రం 4 గంటలకు జగన్‌తో భేటీ అవుతారని సమాచారం.

Published On - 12:15 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu