నా మొత్తం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ‘నమ్మడం’

ట్విట్టర్ వేదికగా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’మూవీ ట్రైలర్ని లాంచ్ చేసారు రాంగోపాల్ వర్మ. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. నిజాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత నుంచి ఆయన జీవితం ఎలా మారింది అన్న కోణంలో రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోషల్ మీడియాను బాగా […]

నా మొత్తం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ‘నమ్మడం’

ట్విట్టర్ వేదికగా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’మూవీ ట్రైలర్ని లాంచ్ చేసారు రాంగోపాల్ వర్మ. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. నిజాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత నుంచి ఆయన జీవితం ఎలా మారింది అన్న కోణంలో రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోషల్ మీడియాను బాగా వాడుకుని ఈ సినిమాకి పాపులేషన్ బాగానే పెంచేసుకుంటున్నారు వర్మ.

1989లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి అంటూ 60 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ ను పరిచయంచేశారు. తర్వాత లక్ష్మీ పార్వతి మెట్లెక్కుతూ మీకు ఫోన్ చేసింది నేనే స్వామి అంటూ మొదటిసారిగా ఎన్టీఆర్ ను కలుస్తారు. ఆ తర్వాత చంద్రబాబు క్యారెక్టర్ కు.. ఈవిడ లక్ష్మీ పార్వతి, మా జీవిత చరిత్ర రాస్తున్నారు అంటూ పరిచయం చేస్తారు ఎన్టీఆర్. ఇంట్లో కుటుంబసభ్యులందరూ లక్ష్మీ పార్వతిని అవమానించే సంఘటనలతో.. ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కు జరిగిన అవమానాల గురించి చెప్పడం జరిగింది. నా మొత్తం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు వాడ్ని నమ్మడం అంటూ ట్రైలర్ కి ముగింపు చెప్పారు వర్మ. ఈ ఒక్క ట్రైలర్ తో అభిమానులను కట్టి పడేశారు వర్మ. కాగా.. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Published On - 11:40 am, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu