కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీలు, పర్యటనలు జరగనున్నాయి. కీలకమైన ఈ పర్యటనను ఉన్నందువల్ల సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక […]

కేసీఆర్‌ ఏపీ పర్యటన రద్దు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీలు, పర్యటనలు జరగనున్నాయి. కీలకమైన ఈ పర్యటనను ఉన్నందువల్ల సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం ఇప్పటికే కసరత్తు చేశారు. ఈ నెల 15న విస్తరణ జరుగుతుందనే ప్రచారం  ఉంది.మంత్రివర్గ విస్తరణపై గురువారం స్పష్టత వచ్చే వీలుంది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇది వెల్లడవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాని పక్షంలో మరో తేదీని ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం విశాఖ పర్యటనను రద్దు చేసుకోవడం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తుంది. ఆయన తరఫున ప్రశాంత్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.

Published On - 11:21 am, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu