జయరామ్ హత్య కేసులో కమెడియన్..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. మరోవైపు రాకేశ్ రెడ్డికి సంబంధం ఉన్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్‌ సూర్య ప్రసాద్‌ అలియాస్ డుంబుును పోలీసులు విచారణకు పిలిచారు. రాకేశ్ కాల్‌ లిస్ట్‌లో సూర్య పేరు […]

జయరామ్ హత్య కేసులో కమెడియన్..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. మరోవైపు రాకేశ్ రెడ్డికి సంబంధం ఉన్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్‌ సూర్య ప్రసాద్‌ అలియాస్ డుంబుును పోలీసులు విచారణకు పిలిచారు. రాకేశ్ కాల్‌ లిస్ట్‌లో సూర్య పేరు ఉండటంతో బుధవారం అతడిని విచారణకు పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురు, అనుకోకుండా ఒక రోజు, మా అన్నయ్య బంగారం వంటి చిత్రాల్లో నటించిన సూర్యకు రాకేశ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులకు డుంబు ఏం చెప్పాడన్నది తెలియాల్సి ఉంది.

Published On - 11:19 am, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu