బిగ్ బాస్ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్
ఇటీవల నాగార్జున అందుబాటులో లేకపోవడంతో సమంత హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మంచి మార్కుల కూడా వేశారు వీక్షకులు.
ఇటీవల నాగార్జున అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్‌ని సమంత హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మంచి మార్కుల కూడా వేశారు వీక్షకులు. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్ చేశారు. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘గతంలో ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్ బాస్ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్’ అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా బిగ్ బాస్ తాజా సీజన్ మంచి జోరుగా సాగుతోంది. ఇటీవల ఎలిమినేషన్ ప్రక్రియపై పలు విమర్శలు వ్యక్తమయినప్పటికీ..ప్రోమోలతో వీక్షకులను ఆకర్షిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
Also Read :
హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు