ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ ఎవరంటే..?

అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం మనాలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంతా బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు..

ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ ఎవరంటే..?
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 29, 2020 | 9:19 PM

Bigg Boss 4: అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం మనాలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంతా బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు హోస్టుగా వ్యవహరించి అందరినీ అలరించింది. ఆ ఎపిసోడ్‌లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, కమెడియన్ హైప‌ర్ ఆది లాంటి సెల‌బ్రిటీలు ఆమెకు త‌మ ‌వంతు స‌పోర్ట్‌ను అందించారు. దీనితో బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.

అయితే ఈ వారం కూడా సమంతా హోస్టుగా వస్తుందా.? లేక కింగ్ కనిపిస్తాడా.? అని సందిగ్దత నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ వారం నాగార్జునే షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. కేవలం దసరా ఎపిసోడ్‌కు మాత్రమే సమంతాను బిగ్ బాస్ నిర్వాహకులు హోస్టుగా తీసుకున్నట్లు సమాచారం.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!