Bigg Boss 4: అరియానాపై హౌజ్‌మేట్స్ ప్రశంసలు.. సొహైల్ టచ్ చేశాడుగా
సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా పెద్ద రచ్చలే జరిగాయి.
Bigg Boss 4 Ariyana: సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా పెద్ద రచ్చలే జరిగాయి. నామినేట్ అయ్యేందుకు ఎవ్వరూ ఒప్పుకోలేదు. అవినాష్, మోనాల్, అభిజిత్, దివి, అరియానా.. అందరూ అయిష్టంగానే ఏడోవారానికి నామినేట్ అయ్యారు. కాగా నామినేషన్ సందర్భంగా అరియానా -మెహబూబ్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎలిమినేట్ అయ్యేందుకు ఇష్టపడని ఇద్దరు పోటాపోటీగా వాదించుకున్నారు. చివరకు అరియానా నామినేట్ చేసుకుంది.
దీంతో అటు హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. అరియానా త్యాగానికి హౌస్‌మేట్స్ ఫిదా అయ్యారు. ఆ ఇద్దరిలో మెహబూబ్ త్యాగం చేసి ఉంటే తన రేంజ్ ఓ లెవల్లో పెరిగిపోయేదని అంతా గుసగుస పెట్టారు. అరియానా నామినేట్ అయిన తరువాత కూడా మెహబూబ్ ఆమె దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. మెహబూబ్ నామినేట్ అయి తన రేంజ్‌ను డౌన్ చేసుకున్నాడని అమ్మ రాజశేఖర్ మాస్టర్ లాస్య, అవినాష్‌కు చెప్పాడు. మరి నామినేట్ అవ్వకుండా హాఫ్ షేవ్ చేసుకున్నప్పుడు అమ్మకు ఈ విషయం గుర్తుకు రాలేదేమో. మరోవైపు అరియానా విషయంలో సొహైల్, నోయల్ మధ్య చర్చ జరిగింది. తమ ఇంట్లో మగదిక్కు లేదని అరియానా చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన సొహైల్.. మగదిక్కు లేకున్నా తన కుటుంబం కోసం అరియానా స్ట్రాంగ్‌గా నిలబడిందని పొగిడాడు. ఇప్పుడు తనకు మెహబూబ్, అరియానాలు ఇద్దరు సమానమని సొహైల్, నోయల్‌కి చెప్పాడు. ఈ మాటతో సొహైల్‌పై వీక్షకుల్లో మరింత అభిమానం పెరిగింది. కాగా బిగ్‌బాస్‌కి ఇచ్చిన మాటతో సొహైల్‌లో చాలా మార్పు వస్తోంది. ఒకప్పుడు షార్ట్ టెంపర్‌గా పేరొందిన సొహైల్.. ఈ మధ్య కూల్ అవుతుండటం విశేషం.
Read More:
Bigg Boss 4: ఎలిమినేషన్‌లో ఆరుగురు.. ఫస్ట్ టైమ్ నామినేట్ అయిన అవినాష్