తెలంగాణలో జిల్లాల వారిగా కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,686 కు చేరాయి. నిన్న మరో నలుగురు చనిపోయారు. మొత్తం నిన్నటి వరకు కరోనా మరణాల…

  • Sanjay Kasula
  • Publish Date - 12:55 am, Tue, 20 October 20

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,686 కు చేరాయి. నిన్న మరో నలుగురు చనిపోయారు. మొత్తం నిన్నటి వరకు కరోనా మరణాల సంఖ్య 1275 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1896 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 2,00,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 21,091 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 212 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 56, జీహెచ్ఎంసీ 212, జగిత్యాల 22, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 07, గద్వాల్ 09, కామారెడ్డి 04, కరీంనగర్ 63, ఖమ్మం 25, ఆసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 11, మహబూబాబాద్ 15, మంచిర్యాల 09, మెదక్ 06, మేడ్చల్ 65, ములుగు 14, నాగర్ కర్నూల్ 11, నల్గొండ 35, నారాయణపేట 2, నిర్మల్ 5, నిజామాబాద్ 29, పెద్దపల్లి 14, రాజన్న సిరిసిల్ల 09, రంగారెడ్డి 98, సంగారెడ్డి 42, సిద్ధిపేట 54, సూర్యాపేట 28, వికారాబాద్ 05, వనపర్తి 11, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 46, యదాద్రి భోనగిరిలో 10 కేసులు నమోదయ్యాయి.