Bigg Boss 4: ఎలిమినేషన్‌లో ఆరుగురు.. ఫస్ట్‌ టైమ్ నామినేట్ అయిన అవినాష్‌

బిగ్‌బాస్‌ 4లో ఏడోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌లో జరిగింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టాడు.

Bigg Boss 4:  ఎలిమినేషన్‌లో ఆరుగురు.. ఫస్ట్‌ టైమ్ నామినేట్ అయిన అవినాష్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 20, 2020 | 7:24 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4లో ఏడోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌లో జరిగింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టాడు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ని జతలుగా విడదీసి, నామినేట్ అయ్యే వారిపై రంగు నీళ్లు పోయాలని బిగ్‌బాస్ వెళ్లడించారు.

ఇక నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా అఖిల్‌, మోనాల్‌లలో నామినేట్ అయ్యేందుకు మోనాల్‌ అంగీకరించింది. ఆ తరువాత సొహైల్‌-అవినాష్‌లలో ఇద్దరూ నామినేట్‌ అయ్యేందుకు ఒప్పుకోలేదు. నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా నామినేట్‌ కాలేదు కదా ఈ సారి నామినేషన్‌కి వెళ్లు అని సొహైల్‌, అవినాష్‌ని కోరారు. కానీ అవినాష్‌ ఒప్పుకోలేదు. పెద్ద చర్చ తరువాత చివరకి అనినాష్‌ అయిష్టంగానే నామినేట్‌ అవ్వడానికి ఒప్పకున్నాడు. తరువాత అవినాష్‌ని సేఫ్ చేయాలని సొహైల్ ప్రేక్షకులను కోరారు.

మరోవైపు అభిజిత్-హారికల మధ్య కూడా ఇలాగే డిస్కషన్ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య త్యాగాల కోసం గొడవపడ్డారు. చివరకు అభిజిత్‌ తనను తాను నామినేట్ చేసుకున్నారు. దీంతో హారిక ఏడుస్తూ అభిపై రంగనీళ్ల బకెట్‌ను వదిలింది. ఆ సమయంలో నువ్వు నామినేట్ అవ్వడం నాకు ఇష్టం లేదంటూ హారిక ఏడ్చేసింది.

మరోవైపు అరియానా -మెహ‌బూబ్‌ల మ‌ధ్య పెద్ద చర్చ జరిగింది. నాకు నామినేట్ కావడం ఇష్టం లేదంటూ హారిక, మెహబూబ్‌ పోటీ పోటీగా వాదించుకున్నారు. ఫైన‌ల్‌గా అరియానా తనను నామినేట్ చేసుకుంది.

దివి, లాస్యల మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. చివరకు తాను నామినేషన్‌కి వెళ్తున్నట్లు దివి చెప్పింది. ఇక గత వారం టాస్క్‌లో నోయెల్‌ ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యాడు. ఇలా ఈ వారం అవినాష్‌, మోనాల్‌, అభిజిత్‌, దివి, అరియానా, నోయల్‌ ఎలిమినేషన్‌కి ఎన్నికయ్యారు.

Read More:

తెలంగాణలో జిల్లాల వారిగా కరోనా కేసులు

టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్