మళ్లీ హౌజ్‌లోకి మోనాల్‌.. అఖిల్‌ ఆనందానికి అవధుల్లేవు

బిగ్‌బాస్ 4 ఆరో వారం ఎలిమినేషన్‌లో భాగంగా చివరగా మిగిలిన కుమార్‌ సాయి, మోనాల్‌ని బట్టలు సర్దుకొని కన్ఫెషన్ రూమ్‌లోకి రావాలని పిలిచారు నాగార్జున

మళ్లీ హౌజ్‌లోకి మోనాల్‌.. అఖిల్‌ ఆనందానికి అవధుల్లేవు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2020 | 8:19 AM

Nagarjuna saves Monal: బిగ్‌బాస్ 4 ఆరో వారం ఎలిమినేషన్‌లో భాగంగా చివరగా మిగిలిన కుమార్‌ సాయి, మోనాల్‌ని బట్టలు సర్దుకొని కన్ఫెషన్ రూమ్‌లోకి రావాలని పిలిచారు నాగార్జున. కుమార్ సాయి ఎలిమినేట్ అయినందుకు ఏమో తెలీదు గానీ.. మోనాల్‌ బట్టలు సర్దుకుంటుంటే మిగిలిన వారందరూ షాక్‌లో ఉండిపోయారు. పలువురు మోనాల్‌ దగ్గరకు వెళ్లి నువ్వు మళ్లీ వెనక్కి వస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్లవు అని ఏడుస్తున్న ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. తాను వెళ్తున్నందునకు ఏం బాధ లేదని మోనాల్ చెప్పింది. ఇక మోనాల్‌ బట్టలు సర్దుకుంటున్న సమయంలో అఖిల్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు.

ఆమె బ్యాగ్ సర్దుకోమనడాన్ని అతను అస్సలు జీర్ణించుకోలేకపోయినట్టు కనిపించాడు. హౌజ్‌లో అటూ ఇటూ తిరుగుతూ బాధలో కనిపించాడు. మోనాల్ దగ్గరగా వస్తుంటే తడిచిన కళ్లతో ఆమె వైపు చూశాడు. ఆ తరువాత దూరంగా వెళ్లిపోయాడు. అయితే అతడిని గట్టిగా హగ్ చేసుకున్న మోనాల్‌ బాధపడొద్దు ఓదార్చింది. అయితే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన తరువాత మోనాల్‌ సేఫ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో.. మళ్లీ హౌజ్‌లోకి వచ్చిన మోనాల్‌అందరికీ హగ్‌లు ఇచ్చి ఆనందాన్ని పంచుకుంది. అఖిల్‌కి స్పెషల్ హగ్గులు ఇచ్చింది. ఇక ఆమె రాకతో అఖిల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే అభిజిత్ మాత్రం వారిద్దరిని పెద్దగా పట్టించుకోలేదు.

Read More:

Bigg Boss 4: మాస్టర్‌పై కుమార్‌ సాయి బిగ్‌బాంబ్‌.. ఈ వారం ఆ పని తప్పదు

Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేటెడ్‌.. కమెడియన్ మూడో‌ కోరికకు నాగ్ అభయం