Bigg Boss 4: మోనాల్ కోసం అరియానా రాయబారం.. నోరు జారిన అభిజిత్
మోనాల్, అభిజిత్‌ల మధ్య కొన్ని రోజులుగా మాటలు లేవు. దీంతో వారిద్దరిని ఎలాగైనా కలపాలని అరియానా డిసైడ్ అయ్యింది.
Abhijeet Ariyana Monal: మోనాల్, అభిజిత్‌ల మధ్య కొన్ని రోజులుగా మాటలు లేవు. దీంతో వారిద్దరిని ఎలాగైనా కలపాలని అరియానా డిసైడ్ అయ్యింది. ఈ విషయం నోయల్‌తో చెప్పి అభి వద్దకు వెళ్లింది అరియానా. ‘నిజంగా చెప్పాలంటే క్షమించు’ అని పాటపాడుతూ అభి దగ్గరకు వెళ్లిన అరియానా.. నీతో ఒక విషయం చర్చించాలని మాటలు ప్రారంభించింది. ఏంటా విషయం అని అభిజిత్ అడగడంతో.. ”జరిగిందేదో జరిగింది. మోనాల్‌తో మాట్లాడు” అని వెల్లడించింది.
అయింతే అభి ఆ రిక్వెస్ట్‌ని సున్నితంగా తిరస్కరించాడు. మోనాల్‌తో మాట్లాడే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టాడు. ఇక ఈ విషయంపై నోయల్, లాస్య, హారికలతో చర్చించాడు అభి. మోనాల్‌తో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, మరి అరియానాకు ఎందుకంత.. అంటూ ఓ ఇబ్బందికర పదం వాడి అభి నోరు జారాడు. అయితే ఆ మాటకు హారిక-లాస్య నవ్వారు.
Read More:
Bigg Boss 4: అరియానాపై హౌజ్‌మేట్స్ ప్రశంసలు.. సొహైల్ టచ్ చేశాడుగా
Bigg Boss 4: ఎలిమినేషన్‌లో ఆరుగురు.. ఫస్ట్ టైమ్ నామినేట్ అయిన అవినాష్