Bigg Boss 4: హాట్ హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. ఆ ఐదుగురిలో ఈసారి ఎవరు బయటికి..!
బిగ్‌బాస్ 4లో 11వ వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. ఎలిమినేషన్ చేసే సమయంలో కంటెస్టెంట్‌ల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది
Elimination Nomination process: బిగ్‌బాస్ 4లో 11వ వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. ఎలిమినేషన్ చేసే సమయంలో కంటెస్టెంట్‌ల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. అభిజిత్, హారికలను నామినేట్ చేశాడు. అరియానా అభిజిత్, లాస్యలను నామినేట్ చేసింది. అలాగే సొహైల్- హారిక, అభిజిత్‌లను.. అభిజిత్- సొహైల్, అరియానాలను.. మోనాల్- లాస్య, అవినాష్‌లను.. లాస్య-మోనాల్, అరియానాలను.. అవినాష్-మోనాల్, అభిజిత్‌లను నామినేట్ చేశారు. ఇలా హాట్‌హాట్‌గా సాగిన 11వ వారం నామినేషన్‌లలో అభిజిత్, మోనాల్, హారిక, లాస్య, అరియానా, సొహైల్‌లు నామినేట్ అయ్యారు. అఖిల్ కెప్టెన్ అవ్వడం, ఇమ్యూనిటీ లభించడంతో నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. ఇక వీరందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కాగా.. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.