బిగ్ బాస్ 3: తమన్నా ఎంట్రీ.. హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు షురూ!

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ అయిన నటి హేమ స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందుకు సంబందించిన ఎపిసోడ్‌ నిన్న టెలికాస్ట్ కాగా.. దాన్ని పరిశీలనగా చూస్తే తమన్నా తనకంటూ పక్కా ప్లాన్‌తో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఎంట్రీతోనే పాత గొడవలన్నీ బయటికి లాగి కొంతమంది కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఆ […]

బిగ్ బాస్ 3: తమన్నా ఎంట్రీ.. హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు షురూ!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2019 | 3:54 PM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ అయిన నటి హేమ స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందుకు సంబందించిన ఎపిసోడ్‌ నిన్న టెలికాస్ట్ కాగా.. దాన్ని పరిశీలనగా చూస్తే తమన్నా తనకంటూ పక్కా ప్లాన్‌తో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆమె ఎంట్రీతోనే పాత గొడవలన్నీ బయటికి లాగి కొంతమంది కంటెస్టెంట్లను తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఆ మధ్య వితిక షేరు విషయంలో వరుణ్ సందేశ్ – మహేష్ విట్టా మధ్య గొడవ జరిగింది. దాని గురించి తమన్నా ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో తాను ఉంటే మహేష్‌కు సపోర్ట్ చేస్తానని.. మహేష్‌ను చీప్ క్యారెక్టర్ అనడం తనకు నచ్చలేదని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె బాబా భాస్కర్, జాఫర్, మహేశ్, అలీరెజా, శ్రీముఖిలతో చెప్పగా.. తమన్నా పక్కా స్కెచ్‌తోనే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని ప్రేక్షకులకు భావన కలుగుతోంది.

అటు వరుణ్ సందేశ్ ఈ విషయాన్ని గ్రహించి తమన్నా.. ఓ గేమ్ ప్లాన్‌తోనే వచ్చిందని.. రావడంతోనే మహేష్‌కు తనకు మధ్య గొడవ పెట్టాలని చూస్తోందని రాహుల్‌తో చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటే తమన్నా ఎంట్రీతో హౌస్‌లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా భార్యాభర్తలిద్దరూ కూడా ఎలిమినేషన్ విషయంలో గేమ్ ఆడుతున్నారని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే వారిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకే తాను ఇద్దర్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. ఏది ఏమైనా తమన్నా రాకతో హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే