Zodiac Signs: జాగ్రత్త.. వీళ్లు చాలా తెలివైనవారు.. ఈ నాలుగు రాశులవారికి దూరంగా ఉండాలి..
సాధారణంగా కొందరు తమ ఇష్టానుసారంగా ఇతరుల మనసును నియంత్రించడానికి ఇష్టపడుతుంటారు. ఒకరి భావోద్వేగాలను
సాధారణంగా కొందరు తమ ఇష్టానుసారంగా ఇతరుల మనసును నియంత్రించడానికి ఇష్టపడుతుంటారు. ఒకరి భావోద్వేగాలను.. వారి మానసిక స్థితిని నియంత్రించడాన్ని వాళ్లు సంతోషిస్తారు. వారు ఎక్కువగా చాలా స్వార్థపరులు. ఇతరుల పరిస్థితిని అనుగుణంగా మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇతరులతో మంచిగా ఉంటూనే.. వారిపై పెద్దరికం చేలాయించాలని చూస్తుంటారు. వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూనే ఇతరులకు నష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల వలన మీరు చాలా బాధపడి ఉంటారు. వారి ఏం చేయాలనుకుంటున్నారో.. వారు మీ మనసును ఏమాత్రం పట్టించుకోరు. అయితే ఇలాంటి స్వభావం అనేది.. వారి రాశిచక్రం పై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిచక్రం ఆధారంగా ఇతరుల స్వభావాలను గుర్తించవచ్చు. కొన్నిరాశుల వారు మ్యానిప్యులేటర్లుగా ఉంటారు. అలాంటి రాశువారికి దూరంగా ఉండాలి.
మిథున రాశి.. వీరు రెండు రకాల స్వభావాలను కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు ముడీగా ఉంటారు. కొన్నిసార్లు వారు తమ తప్పులకు ఇతరులను నిందిస్తారు. వారు చెప్పే అబధ్దాలను కూడా నిజమని నమ్మేవిధంగా మాట్లాడతారు. కానీ ఈ రాశివారు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఎవ్వరైనా సరే వీరి మాటల్లో చిక్కుకుని పోతారు.
కర్కాటక రాశి.. ఈరాశివ్యక్తులు చాలా సున్నితత్వంగా ఉంటారు. కానీ దానిని తమ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలుసు. జరగని వాటి కోసం ఇతరులను బాధపెడతారు. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు చాలా స్పష్టంగా అబద్ధాలు చెబుతారు. ఎదుటి వ్యక్తి దానిని పట్టుకోలేరు.. తమ సౌలభ్యాన్ని బట్టి సంబంధాలు, స్నేహాలు చేసుకుంటారు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
సింహరాశి.. ఈ రాశివారితో వాదన ప్రారంభిస్తే ఎప్పటికీ గెలవలేరు. మాటలను తారుమారు చేయడంలో వీరు నిష్ణాతులు. వీరు తప్పు చేసినా.. తమ అభిప్రాయాన్ని ముందు ఉంచుతారు. దీంతో వారి మాటలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కష్టపడి పనిచేయడం వారికి ఇష్టముండదు.. వారు తమను తప్ప ఇతరుల మాట అస్సలు వినరు. చాలా స్వార్థంగా ఉంటారు.
తులారాశి.. ఈ రాశి వ్యక్తులు తమ కారణంగా ఇతరులు సంతోషంగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. తమ వల్ల ఇతరులు బాధపడతారని వారు భావించినప్పుడు.. అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు.. ఈ పరిస్థితిని నిర్వహించడానికి ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తులను తమ మాటలతో తికమక చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
గమనిక:- ఈ కథనంలో పేర్కోన్న అంశాలు కేవలం జోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.
Also Read: Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
Singer Sunitha: గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. Blessed అంటూ..
S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..
Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?