AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.. కలహాలకు అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను చూసే ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.

Horoscope Today: వీరు అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.. కలహాలకు అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 5:26 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను చూసే ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఏప్రిల్‌ 23 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తిచేస్తారు. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి ఉంది.

వృషభం

సమయానుకూలంగా ముందుకు సాగితే సానుకూల ఫలితాలు పొందుతారు. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనలాభం సూచిస్తుంది. మరిన్ని మంచి ఫలితాలు అందుకోవాలంటే లక్ష్మీ దేవిని దర్శించుకోవాలి.

మిథునం

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. అధికారులు మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. అస్థిరనిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. గొడవలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే శుభం కలుగుతుంది.

కర్కాటకం

వీరికి శుభకాలం నడుస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. బంధు,మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది

సింహం

మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలు, స్నేహితుల సలహాలు తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే మంచి జరుగుతుంది.

కన్య

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. సూర్యాష్టకం చదివితే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

తుల

వృత్తి, ఉద్యోగాలు, ఇతర పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు, ఖర్చులు చేస్తారు. మనోధైర్యం కోల్పోకూడదు. దుర్గాదేవిని దర్శించుకోవడం మంచిది.

వృశ్చికం

చేపట్టిన పనులు సులువుగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సూర్యారాధన వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.

ధనస్సు

ఈరాశివారు మానసికంగా దృఢంగా ఉండాలి. స్నేహితులు, సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి కలుగుతుంది.

మకరం

వీరికి దైవబలం పుష్ఠిగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. కీలక విషయాల్లో పెద్దలను సంప్రదించడం వల్ల మేలు కలుగుతుంది. బంధు మిత్రుల సహకారం అందుతుంది. శని ధ్యానం వల్ల శుభం కలుగుతుంది.

కుంభం

ఒక కీలక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చంద్ర ధ్యానం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

మీనం

ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. సమయ స్ఫూర్తితో అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకాన్ని పఠిస్తే మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:  KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

KTR: దర్యాప్తు సంస్థలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాయి.. కేంద్రానికి తొత్తులుగా మారిపోయాయి: కేటీఆర్‌

Pre Wedding Diet: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ తెలుసు .. కానీ కొత్తగా ఇదేంటబ్బా?..