Horoscope Today: వీరు అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు.. శుక్రవారం రాశిఫలాలు ఉన్నాయంటే..
Horoscope Today: ముందు, వెనుక ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలతో కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా
Horoscope Today: ముందు, వెనుక ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలతో కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళుతుంటారు. మరి ఈ రోజు (ఏప్రిల్22) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం రండి.
మేషం
మంచి మనసుతో పనులు చేస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. కొన్ని అస్థిర నిర్ణయాలు బాగా ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర కలహాలతో సమయం చేయకపోవడం ఉత్తమం. ఇష్ట దేవతలను ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
వృషభం
ఈ రాశివారికి గడ్డు కాలం నడుస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల సహకారం తీసుకోవడం మంచిది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
మిథునం
శుభ వార్తలు వింటారు. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా, ఆప్యాయతతో వ్యవహరించాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
కర్కాటకం
కొత్త పనులు ప్రారంభించేముందు, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తోటివారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. తద్వారా ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకపోవడమే మంచిది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి కలుగుతుంది.
సింహం
సమయస్ఫూర్తితో సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రాముడిని పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
కన్య
చేపట్టిన రంగాల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యహహరించాలి. అనవసర గొడవల్లో తలదూర్చకపోవడం మంచిది. అలాగే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. వెంకకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
తుల
పట్టుదలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అయితే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా మాట అనేముందుకు ఆలోచించుకోవాలి. హనుమంతుడిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.
వృశ్చికం
చేపట్టిన రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొనిపోతే మంచి జరుగుతుంది
ధనుస్సు
ఈరాశుల వారికి గ్రహబలం బాగుంది. చేపట్టిన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కీలక విషయాల్లో అధికారుల ప్రశంసలు, మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
మకరం
ఈరాశివారికి సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసర ఖర్చులు కూడా తగ్గిపోతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచిది.
కుంభం
మనసుకు ఆనందాన్నిచ్చే వార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూల కాలం నడుస్తోంది. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. లింగాష్టకం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
మీనం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకున్న విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదేవతలను పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Summer Skin Care: ఎండలో బయటకు వెళ్తున్నారా ? చర్మాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి..