Kuja Yoga: ఆ రాశుల వారికి ‘కుజ’ యోగం.. వారికి మంచి ఉద్యోగ అవకాశం రావడం పక్కా..!
జ్యోతిష శాస్త్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒక గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు తానున్న రాశివారితో పాటు, తాను వీక్షిస్తున్న రాశికి చెందినవారిని కూడా ప్రాధాన్యంలోకి, ప్రాభవంలోకి తీసుకు వస్తుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉచ్ఛలో ఉన్న కుజుడి వల్ల మకర రాశివారికి,
జ్యోతిష శాస్త్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒక గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు తానున్న రాశివారితో పాటు, తాను వీక్షిస్తున్న రాశికి చెందినవారిని కూడా ప్రాధాన్యంలోకి, ప్రాభవంలోకి తీసుకు వస్తుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉచ్ఛలో ఉన్న కుజుడి వల్ల మకర రాశివారికి, కుజుడు వీక్షిస్తున్న మేష, కర్కాటక, సింహ రాశుల వారికి, కుజుడు అధిపతిగా ఉన్న వృశ్చిక రాశివారికి తప్పకుండా ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. కుజుడు అధికారానికి, డబ్బు కాంక్షకు కారకుడైనందువల్ల ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మార్చి 15 వరకు కొనసాగుతుంది.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు దశమంలో ఉచ్ఛలో ఉండడం ఒక విశేషం కాగా, ఆ కుజుడు చతుర్థ దృష్టితో మేష రాశిని వీక్షించడం మరో విశేషం. దీనివల్ల మేష రాశివారు ఉచ్ఛలోకి, ఉన్నత స్థాయి రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అధికార యోగం పడుతుంది. ఈ రాశివారు తప్పకుండా సంపన్నులు కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
- కర్కాటకం: ఈ రాశిని కుజుడు మకర రాశి నుంచి వీక్షిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో వీరు సహోద్యోగులం దరినీ మించి పోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధి స్తారు. ప్రమోషన్లు రావడానికి, భారీగా ఇంక్రిమెంట్లు పెరగడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయం కావడం, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- సింహం: ఉచ్ఛలో ఉన్న కుజుడు అష్టమ దృష్టితో ఈ రాశిని వీక్షిస్తున్నందువల్ల, అనేక విధాలుగా ఈ రాశి వారికి ఆదాయం కలిసి వస్తుంది. భూమి సంబంధమైన సంపద వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. సమాజంలో అగ్రస్థానంలో ఉన్న కుటుం బంతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు ఉచ్ఛలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగిపోతాయి. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
- మకరం: ఈ రాశిలో కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి సర్వత్రా ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. భూమి సంబంధమైన సంపద పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు, అధికారానికి బాగా అవకాశం ఉంది.