Venus Transit 2023: మినరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ 3 రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభం..
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ క్రమంలోనే ‘ది ప్లానెట్ ఆఫ్ లవ్’గా ప్రసిద్ధి..
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ క్రమంలోనే ‘ది ప్లానెట్ ఆఫ్ లవ్’గా ప్రసిద్ధి చెందిన శుక్రుడు మరో 3 రోజుల్లో అంటే ఫిబ్రవరి 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యం శాస్త్ర గ్రంధాల ప్రకారం మీన రాశిని బృహస్పతి గ్రహం పాలిస్తుంది. ప్రస్తుతం మీనంలో గురుడు యవ్వన దశలో ఉన్నాడు. మీన రాశిలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడి గోచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. మరి ఆ అదృష్టవంతమైన మూడు రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుంచి 11వ పాదంలో సంచరించబోతోంది. దీంతో మీరు పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలలో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభపడతారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.
ధనుస్సు రాశి: శుక్రుని రాశిచక్రం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కూడా మాళవ్య, హన్స్ అనే రాజయోగం ఏర్పడబోతోంది. అందుకే మీరు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే మీ పూర్వీకుల ఆస్తిని మీరు పొందుతారు. టూరిజం, ట్రావెల్, రియల్ ఎస్టేట్, హోటల్ లైన్‌కు సంబంధించిన వారికి ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి: శుక్రుడి రాశి మార్పు మిథున రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కూడా మాలవ్య, హన్స్ అనే రాజయోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో ఉద్యోగ వృత్తిలో ఉన్నవారు ఇంక్రిమెంట్, ప్రమోషన్ పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధించి అనుకున్న రంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులు ఆకస్మిక లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ కూడా విస్తరిస్తుంది.