Narendra Modi: స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలివే..

మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకలను ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అంతకముందు దయానంద్..

Narendra Modi: స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలివే..
Pm Modi Inaugurates Swami Dayanand Saraswati's 200th Birth Anniversary Celebration.
Follow us

|

Updated on: Feb 12, 2023 | 12:32 PM

మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకలను ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘ 2023 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి స్మారక సంవత్సర వేడుకలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా సభను ఉద్దేశించి ప్రసంగిస్తార’ని పేర్కొంది.

ఇంకా ‘1824 ఫిబ్రవరి 12న జన్మించిన మహర్షి దయానంద్ సరస్వతి, అప్పటికి ప్రబలంగా ఉన్న సామాజిక అసమానతలను ఎదుర్కోవడానికి 1875లో ఆర్యసమాజ్‌ని స్థాపించిన సంఘ సంస్కర్త. మహర్షి దయానంద్ సరస్వతి, ఒక సంఘ సంస్కర్త. దేశ సాంస్కృతిక, సామాజిక జాగృతిలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. సంఘ సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులకు, ప్రత్యేకించి భారతదేశ స్థాయిలో వారికి దక్కని గుర్తింపును అందజేసేందుకు కట్టుబడి ఉన్నార’ని కూడా ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇవి కూడా చదవండి

అంతేకాక ‘బిర్సా ముండా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం నుంచి శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో పాల్గొనడం వరకు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నార’ని ప్రకటన ప్రస్తావించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..