Valentine’s Day: వాలెంటైన్స్ డేన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఏ రాశివారికి ఏ గిఫ్ట్ బెస్ట్ ఎంపికో తెలుసుకోండి..
బహుమతినివ్వడం... అందుకు తగిన గిఫ్ట్ ని ఎంపిక చేయడం అనేక నైపుణ్యం కలిగిన కళ. అయితే అందరూ ప్రయత్నించవచ్చు. ప్రత్యేక మైన రోజు ప్రత్యేక వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి బహుమతికి మించినది ఏముంది? ఈ రోజున ప్రేమికుల రోజున ఏ రాశివారికి ఏమి బహుమతి ఇవ్వాలో తెలుసుకుందాం..
వెయ్యి పదాలు చెప్పలేని మాటలను ఒక్క చిన్న బహుమతి చెబుతుందని అంటారు.. అయితే మీరు మీకిష్టమైన వారికీ ఇచ్చే బహుమతి.. సమయానికి సందర్భానికి తగినదై ఉండాలి. మరికొన్ని గంటల్లో ప్రేమికుల రోజుని ప్రేమికులు జరుపుకోనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి ఏ గిప్ట్ ను ఇవ్వాలో తెలియక గందరగోళంగా ఉన్నారా? బహుమతినివ్వడం… అందుకు తగిన గిఫ్ట్ ని ఎంపిక చేయడం అనేక నైపుణ్యం కలిగిన కళ. అయితే అందరూ ప్రయత్నించవచ్చు. ప్రత్యేక మైన రోజు ప్రత్యేక వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి బహుమతికి మించినది ఏముంది? ఈ రోజున ప్రేమికుల రోజున ఏ రాశివారికి ఏమి బహుమతి ఇవ్వాలో తెలుసుకుందాం..
- మేష రాశి: ఈ రాశి వారు అడ్వెంచర్‌ను ఇష్టపడతారు. అందువల్ల సరదా రైడ్స్ ను చేయడానికి.. అడ్వెంచర్ పార్క్‌కి వెళ్లడం వీరిని సంతోష పరుస్తుంది. అంతేకాదు నైట్‌క్లబ్‌కు కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ప్రేమికుల రోజున చేసే ప్రయాణంలో మీ భాగస్వామితో కలిసి ఉండండి. మీరు మీ భాగస్వామి కూడా ఆనందిస్తారు.
- వృషభ రాశి: ఈ రాశివారికి వంటలతో ప్రయోగాలు చేయడం ఇష్టం. కొత్త రెసిపీ పుస్తకం లేదా కొన్ని వంట సామాగ్రిని ఈ రాశి వారికి బహుమతిగా ఇవ్వడం బెస్ట్ ఎంపిక. అంతేకాదు మీరు స్వయంగా వీరి కోసం స్వయంగా వండిన భోజనానికి కూడా వెళ్లవచ్చు.
- మిథున రాశి: ఈ రాశీవ్యక్తులు భిన్నమైన ఆలోచనను అభినందిస్తారు. అయితే ఆచరణాత్మకంగా మీ ప్రేమని తెలియజేయడానికి బహుమతి కూడా అవసరం. పోలరాయిడ్ కెమెరాలు, ఆన్‌లైన్ జర్నల్స్ , గాడ్జెట్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో యాప్ సబ్‌స్క్రిప్షన్ వంటి బహుమతులను ఇస్తే ఖచ్చితంగా ఆనందిస్తారు.
- కర్కాటకరాశి: వీరికి పువ్వులన్నా, మొక్కాలన్నా అత్యంత ఇష్టం.. కనుక ఇంట్లో అందంగా అలంకరించుకోవడానికి ఒక అందమైన చిన్న మొక్క ని బహుమతిగా ఇవ్వవచ్చు. లేదా మెత్తని అల్లిన దుప్పటి వంటివి గిఫ్ట్ గా ఇవ్వవచ్చు.
- సింహ రాశి: ఈ రాశి వారికి ఇష్టమైనవి సంగీత కచేరీ లేదా స్టాండ్-అప్ కామెడీ షో టిక్కెట్లు. లేదా వారి స్నేహితులతో కలిసి చేసే విహార యాత్ర. ప్రేమికుల రోజు వంటి ప్రత్యేకమైన రోజున ఈ రాశివారిని ఇష్టపడే వ్యక్తులు వీరితో ఎక్కువ సేపు గడపడం.. సన్నిహితంగా ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది.
- కన్య రాశి : ఈ రాశి వారు భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. మనసుని ఆకట్టుకునే కథలు, పుస్తకాలను, లేదా మంచి అనుభూతిని కలిగించే పాటలను బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారు.
- తుల రాశి: వీరు ఎక్కువగా అందాన్ని ఇష్టపడతారు. సౌందర్యవంతమైన ఫర్నిచర్, ప్రకృతి అందాలు వీరిని సంతోషపరుస్తాయి. చారిత్రాత్మక ప్రదేశాలను విజిట్ చేయడం కూడా వీరి జీవితంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటుంది.
- వృశ్చిక రాశి: ఈ రాశివారికి ప్రేమికుల రోజున అందమైన డ్రెస్ లేదా ఖరీదైన బ్యాగ్ ఇవ్వడం బెస్ట్ ఎంపిక. ఆ బహుమతులను చూసినప్పుడల్లా మీ గురించి ఆలోచిస్తారనే అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. వీరిని గిఫ్ట్ లతో ఆకట్టుకోవడం కొంచెం కష్టమే కానీ పోర్టబుల్ గాడ్జెట్‌ల వంటి ఉపయోగకరమైన వాటిని అందించండి.
- ధనుస్సు రాశి: ఈ రాశి వ్యక్తులు బంధాలకు విలువ ఇస్తారు. మీరు ఇచ్చే బహుమతి వెనుక లోతైన ఆలోచన ఉన్నంత కాలం, వీరు ఆ గిఫ్ట్ ని జీవితాంతం విలువైనదిగా భావిస్తారు. బ్రాస్‌లెట్ లేదా లాకెట్టు వంటి వస్తువులే కాదు.. ప్రియమైన వారితో గడిపే కొద్దీ సమయం కాఫీ డేట్ అయినా సరే వీరి దృష్టిలో అత్యంత విలువైన బహుమతి. కనుక ప్రేమికుల రోజున చిరునవ్వు జోడించి కొంత ప్రేమను కురిపించండి.
- మకర రాశి: ఈ రాశివారు ఉత్సాహంగా ఉంటారు. ఒక పిక్షనరీ పజిల్ లేదా సుడోకు పుస్తకం మంచి బహుమతి. వీరి మనస్సును ఉత్తేజపరిచే బహుమతులకు అధిక ప్రాముఖ్యతనివ్వండి.
- కుంభ రాశి: ఈ రాశి వారికీ హాబీ కిట్ ఇవ్వండి. కుండలు తయారీ, పెయింటింగ్, అల్లడం మొదలైనవి కావచ్చు. వీరు ఎక్కువగా తమ సమయాన్ని కొత్త విషయాలను నేర్చుకోవడనికి ఇష్టపడతారు. మీరు కుంభ రాశి వారిని సంతోషపరచడానికి లాంగ్ డ్రైవ్‌కి కూడా తీసుకెళ్లవచ్చు.
- మీన రాశి: ఈ రాశివారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండాలంటే.. వీరు మీరు ఇచ్చిన బహుమతిని ఉపయోగించే ప్రతిసారీ మీ గురించి వారికి గుర్తుచేసే విధంగా ఉండాలి. ఎయిర్ డిఫ్యూజన్, పెర్ఫ్యూమ్స్ వంటికి మంచి బహుమతులు. వీరికి అందమైన ఆకర్షణీయమైన డైరీలను కూడా ఇవ్వవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)