Sattemma Talli Jatara: ఘనంగా సత్తెమ్మతల్లి జాతర.. నేడు అన్నసమారాధన.. అమ్మవారి ఊరేగింపు

చెయ్యెరు గున్నేపల్లి సత్తెమ్మతల్లి మహా జాతర మోహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యింది. అన్న సమారాధనకు భారీగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

Sattemma Talli Jatara: ఘనంగా సత్తెమ్మతల్లి జాతర.. నేడు అన్నసమారాధన.. అమ్మవారి ఊరేగింపు
Gunnepalli Sattammatalli
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 6:37 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చేయ్యేరు- గున్నేపల్లిలో శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పందిరి రాటతో జాతర అంకురార్పణ చేసిన ఆలయ కమిటీ.. జాతర కోసం భారీ ఏర్పాట్లు చేసింది . సత్తెమ్మ తల్లి 49వ వార్షికోత్సవ సందర్భంగా ఉత్సవాలకు భారీగా ప్లాన్ చేశారు ఆలయ అధికారులు. ఆదివారం జరగనున్న అమ్మవారి ఊరేగింపునకు రెండువేల మంది కళాకారులతో భారీగా ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. అమ్మవారి అన్న సమారాధనకు లక్ష మందికి పైగా భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు భారీ సెట్టింగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఆలయ ప్రాంగణం.

అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం భారీ బాణాసంచా కాల్పులు జరిపారు. అధికంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. 100 పాత్రలలో ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు. 100 మంది..వంట మనుషులు, అన్న సంతర్పణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు…100 కేజీల గిన్నెలు, 200 కేజీల పెద్ద అక్షయ పాత్రలలో వంటకాలు చేస్తున్నారు. దీనితో ఆలయ నిర్వహికులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..