Srisailam Brahmostavalu: కన్నుల పండువగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పణ..
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు స్వామివార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు..
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు స్వామివార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు కాళహస్తి ఈవో విజయసాగర్ బాబు దంపతులు. రాజగోపురం వద్ద గళవాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో ఎస్.లవన్న, చైర్మన్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.
అనంతరం శ్రీశైలం ఈవో లవన్నకు చైర్మన్ కు శ్రీకాళహస్తి ఈవో విజయసాగర్ బాబు శేష వస్త్రాలతో సత్కరించారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు చైర్మన్ చక్రపాణిరెడ్డి. భక్తులకు తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అన్నదాన వసతి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులు భారీగా తరలి వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..