AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం

Salt Vastu Tips: ఉప్పు కేవలం రుచికి మాత్రమే కాదు, వాస్తు, ఆధ్యాత్మిక పరంగానూ ప్రాముఖ్యత కలిగి ఉందని నమ్మకం ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గించి, శాంతి, శ్రేయస్సును పెంచుతుందని భావిస్తారు. సాయంత్రం ఉప్పు ఇవ్వకూడదని, దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలనే విశ్వాసం ఉంది. ఉప్పును సరిగా ఉపయోగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
Vastu Tips
Rajashekher G
|

Updated on: May 04, 2026 | 7:04 PM

Share

ఉప్పు లేని వంట రుచిగా ఉండదు. కానీ ఉప్పు కేవలం రుచికే కాదు, వాస్తు శాస్త్రం, ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించడం నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం వరకు ఉప్పును ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే ఉప్పు వినియోగానికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.

సాయంత్రం ఉప్పు ఇవ్వకూడదా?

వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఎవరికీ ఉప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, పేదరికం వచ్చే అవకాశం ఉందని అంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని కూడా విశ్వాసం ఉంది. శుక్ర గ్రహ ప్రభావం బలహీనమవుతుందని, దాని వల్ల కుటుంబ జీవితం, మనశ్శాంతిపై ప్రభావం పడవచ్చని చెబుతారు.

ఉప్పు దానం నియమాలు

ఉప్పును దానం చేయడం శుక్రవారం రోజున శుభప్రదంగా భావిస్తారు. అయితే ఉప్పును నేరుగా చేతి నుంచి చేతికి ఇవ్వకుండా, ఒక పాత్రలో ఉంచి ఇవ్వడం మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. అలాగే సూర్యాస్తమయానికి ముందే దానం చేయడం ఉత్తమం అని నమ్మకం.

ఇంట్లో సానుకూల శక్తి కోసం చిట్కాలు

ఇంట్లో సానుకూలత కోసం శుక్రవారం రోజున చిన్న ఎరుపు గుడ్డలో కొద్దిగా ఉప్పు వేసి మూట కట్టి వంటగదిలో ఉంచుతారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం. అదే విధంగా, ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి శుభ్రం చేయడం వల్ల చెడు దృష్టి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఉప్పును గాజు పాత్రలో ఉంచడం మంచిదని, ఇది శని, చంద్ర దోషాలను తగ్గించడంలో సహాయపడుతుందని కూడా భావిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె