AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనైశ్చరి అమావాస్య: ఒక్క పని చేస్తే చాలు.. శని దోషాలు పోయి, లక్ డైరెక్ట్‌గా ఇంటికే వస్తుంది!

Shani Amavasya: జ్యోతిష్యంలో శని దేవుడిని కర్మఫల దాతగా భావిస్తారు. 2026 మే 16న శనివారం శని జయంతి, శనైశ్చరి అమావాస్య ఒకే రోజు రావడం అరుదైన యోగం. ఈ రోజున శని దేవుడిని భక్తితో ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని, కష్టాలు తొలగి పనులు సాఫీగా పూర్తవుతాయని నమ్మకం.

శనైశ్చరి అమావాస్య: ఒక్క పని చేస్తే చాలు.. శని దోషాలు పోయి, లక్ డైరెక్ట్‌గా ఇంటికే వస్తుంది!
Shani Amavasya
Rajashekher G
|

Updated on: May 04, 2026 | 6:04 PM

Share

Shani Amavasya: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మల ఫలితాలను న్యాయంగా అందించే దేవుడిగా భావిస్తారు. 2026 మే 16న ప్రత్యేకమైన యోగం ఏర్పడుతోంది. ఆ రోజు శనివారం కావడంతో శని జయంతి ‘శనైశ్చరి అమావాస్య’గా కలిసివస్తుంది. ఇలాంటి అరుదైన సందర్భంలో శని దేవుడిని భక్తితో ఆరాధిస్తే ఫలితాలు మరింతగా లభిస్తాయని పండితులు పేర్కొంటారు. సూర్య దేవుడు, ఛాయాదేవి కుమారుడైన శని దేవుడు రూపంలో కఠినంగా కనిపించినా, ధర్మాన్ని పాటించే వారికి అపారమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఆయన కటాక్షం ఉన్నవారికి కష్టాలు క్రమంగా తొలగి, నిలిచిపోయిన పనులు కూడా సాఫీగా పూర్తి అవుతాయి.

శని ప్రభావం ఉన్నవారు చేయాల్సినవి..

ప్రస్తుతం ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా శని మహాదశ అనుభవిస్తున్నవారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం. భక్తితో నల్ల నువ్వులు, మినుములు, నల్ల వస్త్రాలు దానం చేస్తే శని దేవుడు ప్రసన్నమవుతాడు. శని ఆలయ దర్శనం, శని చాలీసా పఠనం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. నల్ల మినుములతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించడం కూడా మంచిదిగా భావిస్తారు. ఈ ప్రత్యేక రోజున కొన్ని నియమాలు పాటించడం అవసరం ఉంది.

శని జయంతి రోజున నివారించాల్సినవి..

శని దేవుడికి ఇష్టమైన వస్తువులైనా, ఆ రోజున వాటిని కొనడం మంచిది కాదు. ఇనుప లేదా లెదర్ వస్తువులు కొనడం ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చని నమ్మకం. ఎవరినీ అవమానించకుండా గౌరవంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా పేదలు, కార్మికులను అవమానించొద్దు. మద్యం, మాంసాహారం వదిలి సాత్విక ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. జుట్టు, గోర్లు కత్తిరించడం వంటి పనులను నివారించాలి.

మంత్రాలు, పరిహారాలు

“ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శని దోష నివారణకు సహాయపడుతుంది. శని ఆలయంలో నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా జాతకంలోని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని విశ్వాసం. ఈ రోజున చేసే దానాలు, పూజలు మీ కర్మ ఫలాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us