AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు, శుక్రుల అరుదైన యుతి.. ఈ రాశుల వారికి అదృష్ట దేవత కటాక్షం..!

Lucky Zodiac Signs: మిథున రాశిలో గురు-శుక్రుల అరుదైన యుతి కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన అదృష్ట యోగాలు కలగనున్నాయి. జూన్ 2 వరకు కొనసాగే ఈ శుభ సంయోగం వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశుల వారికి ధనం, విజయాలు, శుభవార్తలు వరుసగా అందే అవకాశం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలు చేయడం మరింత శుభప్రదంగా భావిస్తున్నారు.

గురు, శుక్రుల అరుదైన యుతి.. ఈ రాశుల వారికి అదృష్ట దేవత కటాక్షం..!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2026 | 4:47 PM

Share

మిథున రాశిలో గురు, శుక్రులు కలవడం కొన్ని రాశుల వారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు కలగజేస్తాయి. ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల లక్ష్మీదేవి, కుబేరుడు ఈ రాశుల ఇంట ప్రవేశించడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల యుతి జూన్ 2వరకు కొనసాగబోతోంది. జాతక చక్రంలో గురు, శుక్రులు బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడికి జీవితం విజయాలు, సాఫల్యాలు అనుభవానికి రావడమే కాక, జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా కొట్టుకు పోతాయి. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశుల వారిని మరో రెండు వారాల పాటు అదృష్ట దేవత కరుణించబోతోంది. ఈ రాశివారు లక్ష్మీదేవికి పూజ చేయడం మంచిది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో కలిసిన శుక్ర, గురువులు భాగ్య స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి కొద్ది శ్రమతో అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కార మవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అంచనాలను మించి ఆదాయం బాగా పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురు, శుక్రుల కలయికతో పాటు, శని, బుధ, రవి గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఊహించని విధంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభి స్తుంది. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా సమసిపోతుంది.
  3. మిథునం: ఈ రాశిలో గురు, శుక్రుల సంచారం, భాగ్య స్థానాన్ని గురువు వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి తప్పకుండా అదృష్టం పడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  4. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడితో ఉన్న గురువు ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగి పోతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురువు కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. భాగ్య కారకుడైన గురు గ్రహం భాగ్య స్థానంలోనే ఉండడం ఊహించని అదృష్టాలను కలిగిస్తుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ధన వర్షం కురిపిస్తాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్న గురువు భాగ్య స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సఫలమవుతాయి. తప్పకుండా అదృష్ట దేవత కరుణిస్తుంది. వ్యక్తిగత. ఆర్థిక సమస్యలు చాలావరకు మటుమాయం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

Follow Us