Ugadi 2025 Gemini Horoscope: మిథున రాశి ఉగాది ఫలితాలు.. కెరీర్ పరంగా ఎలా ఉంటుంది?
Ugadi 2025 Gemini Horoscope: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలతో పాటు ప్రాధాన్యత కూడా పెరిగే అవకాశముంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు మరింత అనుకూలంగా ఉంటాయి. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం – 14, వ్యయం – 2 | రాజపూజ్యాలు – 4, అవమానాలు – 3
మార్చి 29న శనీశ్వరుడు దశమ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశివారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యానికి లోటుండదు. ఉద్యోగు లకు, నిరుద్యోగులకు విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం చాలా మంచిది. ఉద్యో గంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మే 18న భాగ్య స్థానం లోకి రాహువు, మే 25న మిథున రాశిలోకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహా రాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
ఈ రాశివారికి ముఖ్యంగా జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. దీనివల్ల సంపాదన మరింత పెరుగు తుంది. కుటుంబ బంధాలు పటిష్టం అవుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల నిస్తాయి. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. అనారోగ్యాలు, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పట్టి ఫిబ్రవరి వరకూ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోయే అవ కాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో మొదటి నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కొందరు బంధుమిత్రులను ఎక్కువగా నమ్మడం వల్ల నష్టపోయే సూచనలున్నాయి. నెలకొకసారి శివార్చన చేయించడం, ఒకరిద్దరికి అన్నదానం చేయడం వల్ల ఈ ఏడాదంతా ఆనందంగా, తృప్తికరంగా గడిచిపోయే అవకాశం ఉంది.