Ugadi 2025 Cancer Horoscope: కర్కాటక రాశి ఉగాది ఫలితాలు.. ఆరోగ్యం ఎలా ఉంటుంది?
Ugadi 2025 Panchangam Karkataka Rasi: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మే నెలలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే 18 నుంచి కుటుంబ, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. జూలై నుంచి నాలుగు నెలలు శుభ ఫలితాలు అనుభవించవచ్చు. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 8, వ్యయం 2 | రాజపూజ్యాలు 7 అవమానాలు 3
ఈ రాశివారికి ఉగాదితో అష్టమ శని వెళ్లిపోతున్నందువల్ల అనేక కష్ట నష్టాల నుంచి బయట పడడం ప్రారంభం అవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభ కార్యాలన్నీ జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం మొద లవుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. మే 25న గురువు వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తున్నం దువల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పే అవకాశం ఉంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. మే 18న రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గిపో తాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కొద్దిగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొద్ది శ్రమతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ఈ రాశివారికి జూలై నుంచి నాలుగు నెలల పాటు శుక్ర, బుధ, రవులు అనుకూలంగా ఉండ బోతున్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం అనుకున్న రీతిలో పెరిగే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గ్రహాల సంఖ్య పెరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. విదేశీయానాలకు, విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం కానీ, ఉద్యోగం మారడానికి గానీ అవకాశం ఉంది. ఏ విధమైన ప్రయత్నమైనా సత్వరం నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలల్లో ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులతో వైరాలు, వైషమ్యాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం, కుజుడికి సుందరకాండ పారాయణం చేయడం అవసరం.