Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (ఏప్రిల్ 15, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. మిథున రాశి వారికి రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 15th April 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 15, 2025 | 6:07 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 15, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. మిథున రాశి వారికి రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగపరంగా శుభ వార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఫలితం, ప్రతిఫలం ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థుల మీద కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడ తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితంలో రాబడికి లోటుండదు. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులకు సాయం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పట్టుదలగా ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ఇంటా బయటా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు ఎంతో శ్రమపడి ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 వచ్చేశాయ్.. లింక్ ఇదే
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 వచ్చేశాయ్.. లింక్ ఇదే
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..?
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..?
ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..
ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..
ముగ్గురు వ్యక్తులు ఏదో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
ముగ్గురు వ్యక్తులు ఏదో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా
అక్కడ తాకుతూ మాటలు.. ఆపై కమిట్‌మెంట్లు..
అక్కడ తాకుతూ మాటలు.. ఆపై కమిట్‌మెంట్లు..
ప్రణీత కుమారుడి బారసాల వేడుకలో సినీ తారల సందడి.. ఫొటోలు ఇదిగో
ప్రణీత కుమారుడి బారసాల వేడుకలో సినీ తారల సందడి.. ఫొటోలు ఇదిగో
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..