Lucky Zodiac Signs: నీచ పరివర్తన.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు..!
Telugu Astrology: అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో కుజ చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆస్తి, ఆదాయం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, అనుకూల పరిణామాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఈ మూడు రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. నిర్దిష్ట రాశులకు సంబంధించిన వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకోండి.

ఈ నెల 13, 14, 15 తేదీల్లో కుజ, చంద్రుల మధ్య పరివర్తన జరగబోతోంది. కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో చంద్రుడు. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడు సంచారం చేస్తున్నందు వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. చంద్రుడికి వృశ్చిక రాశి, కుజుడికి కర్కాటక రాశి నీచ స్థానాలు కావడం ఇక్కడ విశేషం. నీచ స్థితిలో ఉన్న ఈ రెండు గ్రహాల మద్య పరివర్తన జరిగినప్పటికీ కొన్ని రాశులకు ఈ పరివర్తన ఊహించని అదృష్టాలు కలగజేస్తుంది. ఈ పరివర్తన ఆస్తి, ఆదాయం, రాబడి, లాభాలకు సంబంధించిన యోగం. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు ఈ పరివర్తన వల్ల సంపన్నులవుతారు. ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు మున్ముందు తప్పకుండా విజయవంతం అవుతాయి.
- వృషభం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన చంద్రుడితో సప్తమాధిపతి కుజుడికి పరివర్తన జరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై, ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు పంచమాధిపతి కుజుడితో పరివర్తన చెందినందువల్ల ఆకస్మిక ధన లాభా లతో పాటు అప్రయత్న ధన లాభాలు కూడా కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అత్యధికంగా లాభాలనిస్తాయి.
- తుల: ఈ రాశికి ఈ ధన, దశమాధిపతుల పరివర్తన వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం, రావలసిన డబ్బు చేతికి అందడం, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ధన లాభాలు కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగు లకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం లభించే అవకాశం కూడా ఉంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో భాగ్యాధిపతి చంద్రుడికి పరివర్తన జరిగినందువల్ల ఆకస్మిక దన లాభానికి అవకాశముంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన సొమ్ము, మొండి బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి వార సత్వ సంపద లభిస్తుంది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి.
- మకరం: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇల్లు అమరే సూచనలున్నాయి.
- మీనం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో హోదాలు, జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, లాభాలు తప్పకుండా వృద్ధి చెందుతాయి. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. మదుపులు, పెట్టుబడులు లాభాలు పండిస్తాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగులు లభిస్తాయి.