AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taurus Yearly Horoscope 2023: వృషభరాశివారు కొత్త ఏడాదిలో ఏ నెలలో ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసా..

వృషభ రాశివారికి కొత్త సంవత్సరం చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరం ఈ రాశివారు కన్న కలలు చాలా వరకు నెరవేరుతాయి. ఏడాది పొడవునా గౌరవంతో జీవిస్తారు. 2023లో వృషభ రాశి వారిపై శని, గురుగ్రహ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో.. అక్టోబర్ 30 న రాహువు తన స్తానాన్ని మార్చుకుంటుంది. దీంతో ఈ రాశివారు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది.

Taurus Yearly Horoscope 2023: వృషభరాశివారు కొత్త ఏడాదిలో ఏ నెలలో ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసా..
Taurus Yearly Horoscope 2023
Surya Kala
|

Updated on: Dec 29, 2022 | 5:31 PM

Share

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు కొత్త ఏడాదిలో ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో తమ రాశిఫలాలను తెలుసుకోవడంపై దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వృషభ రాశి వారికి 2023 సంవత్సరం ఎలా ఉండనున్నదో తెలుసుకుందాం.. వృషభ రాశివారికి కొత్త సంవత్సరం చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరం ఈ రాశివారు కన్న కలలు చాలా వరకు నెరవేరుతాయి. ఏడాది పొడవునా గౌరవంతో జీవిస్తారు. 2023లో వృషభ రాశి వారిపై శని, గురుగ్రహ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో.. అక్టోబర్ 30 న రాహువు తన స్తానాన్ని మార్చుకుంటుంది. దీంతో ఈ రాశివారు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. 2023 సంవత్సరంలో.. ఈ రాశివారు నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు దాదాపుగా నెరవేరుతాయి. అయితే 22 ఏప్రిల్ 2023న మేషరాశిలో బృహస్పతి సంచారించనుంది. దీంతో వీరు కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహు-కేతువుల రాశి మార్పు వీరి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ రాశివారు ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి జాతకులు: కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదాలు ,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదాలు  (వే,వో)

జనవరి – సంవత్సరం ప్రారంభం ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో నష్టాలు రావచ్చు. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే జనవరి మాసంలో ఆరోగ్యం బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి – ఈ నెలలో మీ ఆర్థికంగా గత నెల కంటే బలంగా ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి.. మాటలను నియంత్రించుకోండి. ఏదైనా పనిని మొదలు పెడితే.. అది పూర్తయ్యే వరకు పబ్లిక్ చేయవద్దు.

మార్చి– డబ్బు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఇల్లు లేదా భూమి లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. దీని వల్ల మీ కల నెరవేరుతుంది. మీ శత్రువులు మీ ముందు ఓటమితో వస్తారు.

ఏప్రిల్– ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఉన్నతాధికారుల నుండి సహకారం కూడా అందుతుంది. కుటుంబంలోని సీనియర్ సభ్యుల నుండి ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

మే– ఈ నెలలో మీ ధైర్యం మరింత పెరుగుతుంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృధా ఖర్చులు పెరగవచ్చు.

జూన్– పని,వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. అయితే శారీరక బాధలు సమస్యలను పెంచుతాయి. శుభ కార్యాల వల్ల కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

జూలై– అన్ని వైపుల నుండి వచ్చే లాభం, భూమి , ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంది.

ఆగష్టు– ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ టెండర్, ఇంటి వాహనం కొనుగోలు వంటి వాటికీ దరఖాస్తు చేసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

సెప్టెంబర్– ఈ నెలలో ఈ రాశివారు తమ మొండితనం, అభిరుచిని అదుపులో ఉంచుకుని పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మరింత విజయవంతమవుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు.

అక్టోబర్– పోటీలో విజయం, ప్రేమ సంబంధిత విషయాలలో ఉదాసీనత ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల శుభఫలితాలను ఇస్తుంది.

నవంబర్-ఈ నెలలో విజయాల పరంపర కొనసాగుతుంది.  మానసిక సంతోషాన్ని ఇచ్చే శుభవార్త వింటారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

డిసెంబరు– ఈ నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసులో ఉద్యోగులు కుట్రల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.  వైవాహిక జీవితంలో  ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

సంతోషకరమైన సంఖ్య – 6.. సంతోషకరమైన తేదీలు – 6, 15, 24 .. సంతోషకరమైన నెల – మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ .. హ్యాపీ కలర్ – ఆకుపచ్చ, నీలం, తెలుపు, క్రీమ్,..  హ్యాపీ డే – శుక్రవారం, శనివారం బుధవారం.. శుభ రత్నం – డైమండ్, పచ్చ, నీలమణి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)