Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.?
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది.
-
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం నిలకడగా ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆశించిన స్థాయిలో వ్యాపారులు లాభాలు ఆర్థిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిత్రులు అండగా ఉంటారు.
-
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. స్నేహితుల సహకారంతో ఒక పెద్ద వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.
-
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. తన కు మాలిన ధర్మంగా ఇతరులకు బాగా సహాయపడతారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సోదరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొండి బకాయి ఒకటి పశువులు అవుతుంది.
-
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఆచితూచి మాట్లాడండి. అధికారుల సహాయం ఉంటుంది. ఆదాయపరంగా మంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. అవసరానికి డబ్బు అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.
-
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. డబ్బు ఇవ్వాల్సిన వారు వాయిదా వేస్తూ ఉంటారు. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
-
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అన్ని విధాల కలిసి వచ్చే సమయం ఇది. అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగంలో పట్టుదలగా పనిచేసి లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ అందుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.
-
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరిగినప్పటికీ సత్ఫలితాలను ఇస్తుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పిల్లల్లో ఒకరికి విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. మిత్రులకు మేలు చేస్తారు.
-
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం వారితో చికాకులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది. మీ ఆర్థిక స్తోమతను మించి ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
-
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గ్రహ సంచారం చాలావరకు మీకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రులలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఒక విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ పరంగా మంచి ఆఫర్ వస్తుంది. వీసా సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. మీ స్థలం విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా గడిచిపోతుంది.
-
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగ జీవితం బాగానే సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుంటారు. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు.
-
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచాలి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మితిమీరిన ఔదార్యం కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.