Sabarimala: స్వామియే శరణం అయ్యప్ప.. మండల పూజకు పోటెత్తిన భక్తులు.. అప్పటి వరకు ఆలయం మూసివేత..
శబరిమల అయ్యప్ప సన్నిధానం తాత్కాలికంగా మూతపడింది. 41 రోజుల మండల పూజలు చేసిన తర్వాత.. తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. ఆలయాన్ని తిరిగి డిసెంబర్ 30న తెరుస్తారు. 2023 జనవరి 14న మకర...
శబరిమల అయ్యప్ప సన్నిధానం తాత్కాలికంగా మూతపడింది. 41 రోజుల మండల పూజలు చేసిన తర్వాత.. తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. ఆలయాన్ని తిరిగి డిసెంబర్ 30న తెరుస్తారు. 2023 జనవరి 14న మకర విళక్కు పూజలు నిర్వహిస్తారు. అనంతరం జనవరి 20 న ఆలయాన్ని తిరిగి మూసేస్తారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మణికంఠునడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకులు కందరారు రాజీవరు ఈ పూజలు నిర్వహించారు. కలశాభిషేకం, కలభాభిషేకం కార్యక్రమాలు చేపట్టారు. ఈ పూజలకు శబరిమల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక సభ్యులు సైతం హాజరయ్యారు. ఈ పూజతో.. 41రోజుల పాటు సాగే వార్షిక తీర్థయాత్ర సీజన్ తొలి విడత ముగిసింది.
మూడురోజుల విరామం అనంతరం ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మకరవిళక్కు కార్యక్రమం కోసం తెరుస్తారు. దీంతో తీర్థయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది. 2023 జనవరి 14న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసేస్తారు. దీంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగుస్తుంది. కాగా.. ఈ 41 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ మంగళవారం తెలిపారు.
మండల పూజల రోజుల్లో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. 39 రోజుల్లో రూ.222.98 కోట్లు వచ్చిందని దేవస్వోమ్ బోర్డ్ వెల్లడించింది. ప్రత్యేక పూజల సమయంలో శబరి గిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.