AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: జీవిత భాగస్వామి కళ్లలో ఆనందం చూసేందుకు ఈ రాశులవారు ఏమైనా చేస్తారు.. అందులో మీరున్నారా?

తమ భాగస్వామికి తాము ఎంత ప్రేమ,  ఆప్యాయతను అందిస్తున్నామో.. తిరిగి తమ భాగస్వామిని అదే విధంగా తమకు ప్రేమని అందించాలని ఆశిస్తారు. అయితే కొందరు మాత్రం తమ ప్రేమ, కరుణ అవతలివారికి ఎటువంటి షరతులు లేకుండా అందిస్తారు.

Zodiac Signs: జీవిత భాగస్వామి కళ్లలో ఆనందం చూసేందుకు ఈ రాశులవారు ఏమైనా చేస్తారు.. అందులో మీరున్నారా?
Horoscope
Surya Kala
|

Updated on: Dec 26, 2022 | 5:47 PM

Share

మానవ సంబంధంలో భార్యాభర్తల  సంబంధం వెరీ వెరీ స్పెషల్. తమని కన్న తల్లిదండ్రులు, తమ కడుపున పుట్టిన పిల్లలు కొంతకాలం మాత్రమే తోడుగా ఉంటారు.. అయితే భర్త భర్తలు మాత్రం జీవితాంతం కష్ట, సుఖాలు .. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒకరికొకరు తోడునీడగా జీవిస్తారు. అయితే ఒకరి కోసం ఏదైనా పని చేసినప్పుడు.. తిరిగి తమకు వారు అండగా నిలబడాలని ఆశిస్తారు. అంతేకాదు తమ భాగస్వామికి తాము ఎంత ప్రేమ,  ఆప్యాయతను అందిస్తున్నామో.. తిరిగి తమ భాగస్వామిని అదే విధంగా తమకు ప్రేమని అందించాలని ఆశిస్తారు. అయితే కొందరు మాత్రం తమ ప్రేమ, కరుణ అవతలివారికి ఎటువంటి షరతులు లేకుండా అందిస్తారు. తమ భాగస్వాములు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని బలంగా కోరుకుంటారు. ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు తమ భాగస్వామి నుంచి ఎటువంటివి ఆసించకుండా ఇష్టపడి సహాయం చేస్తారు.  వారికీ సహాయం చేసి.. తమ ఆనందాన్ని వెదుకుకుంటారు.. ఈ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశివారు తమ ప్రేమికులను సంతోష పెట్టడంలో, సహాయం చేయడంలో తమ సంతోషాన్ని వెదుకుకుంటారు. అంతేకాదు వీరి తమ భాగస్వామితో ఎల్లప్పుడూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అవతలివారు ఎక్కడ ఉన్నా తమ బంధం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ  భాగస్వాములతో బంధం నిలుపుకోవడం కోసం తమ సమయాన్ని,  పూర్తి దృష్టిని కేటాయిస్తారు. అయితే అదే సమయంలో తమ సహచరులు తమ సహాయానికి ప్రేమకి ప్రతిస్పందించాలని..  సంబంధాన్ని మరింత బలపడే విధంగా ఉండాలని ఆశిస్తారు. ఈ రాశివారు మొత్తానికి తన భాగస్వామిని సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తారు. అదే సమయంలో అవతలి వారి నుంచి ప్రతికూల ప్రతిస్పందనను అంగీకరించరు.

కర్కాటక రాశి: ఈ రాశి వ్యక్తులు మంచి పెంపకానికి గుర్తులు.  అందువల్ల వీరు తమ భుజాలపై ఎక్కువ బాధ్యత ఉన్నట్లు తమ భాగస్వామి భావించాలని ఎప్పటికీ కోరుకోరు. తమ జీవిత భాగస్వామికి ఏదైనా అవసరంలో మద్దతు ఇవ్వడానికి ..  వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. తమ భాగస్వామి డిమాండ్‌లను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అంటే తమ జీవిత భాగస్వామిని ఆనందంగా ఉంచడం కోసం వారిని తరచుగా ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడానికి.. ఇష్టమైన వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వడానికి లేదా పనిలో వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: ఈ రాశివారు లోతైన వ్యక్తులు. ఆలోచనలో పరిపూర్ణత స్వభావం కలిగి ఉంటారు. వీరి దృష్టి నుంచి ఏ విషయాలు దాటి వెళ్లవు. ఈ రాశి వ్యక్తులు తమ భాగస్వామి ఏమి కోరుకుంటుందో చెప్పకుండానే తెలుసుకుంటారు. అంతేకాదు తమ భాగస్వామిని ఎప్పుడూ నిరుత్సాహానికి గురిచేయకుండా.. వారికి సుఖంగా ఉండేలా చేయడానికి ఎంత కష్టమైన పనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వక్తులు తమ భాగస్వామి యొక్క అవసరాలను అర్థం చేసుకోవడం.. అది వారు అడగకుండానే అవి తీర్చడంతో పాటు ఇంట్లోని భాద్యతల్లో తగిన సహాయం చేయడానికి కూడా ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు.

తుల రాశి: ఈ రాశి వారు తమ సహచరుల పట్ల నిబద్ధతలో నిజాయితీగా ఉంటారు. ఒకరితో సంబంధం కోరుకుంటే.. తమని తాము మెరుగు పరచుకుంటూ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడతారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిపై అత్యంత ప్రేమను చూపుతారు. వీరు అవతలి వారు ఏమీ అడగకుండానే అన్ని నెరవేరుస్తారు. తమ జీవిత భాగస్వామికి ఏ చిన్న కష్టం వచ్చినా వీరు గుర్తిస్తారు.. తమకు ఇబ్బందులు చెప్పకుండానే ఆస్పత్రికి తీసుకుని వెళ్లి.. చికిత్స చేయించడం నుంచి మంచి భోజనం తయారు చేయడం వరకు అన్నీ చేస్తారు. ఈ రాశివారు స్థిరమైన సంబధాన్ని కోరుకుంటారు. ప్రేమగా, శాంతియుతంగా , సామరస్యపూర్వకంగా జీవించడానికి ఇష్టపడతారు.

ఈ నలుగురు రాశులకు చెందిన వ్యక్తులు తమ భాగస్వాములకు సహాయం చేసి ఆనందిస్తారు. తమపై ఆధారపడినప్పుడు.. కూడా అండగా నిలబడతారు. తమ జీవిత భాగస్వామి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తారు. వారిని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని చూస్తారు.. కష్టాల్లోకి నెట్టడానికి ఇష్టపడరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)